Begin typing your search above and press return to search.

ఎవ‌రో చెబితే త‌గ్గ‌ను, పెర‌గ‌ను-ర‌వితేజ‌

By:  Tupaki Desk   |   10 Dec 2015 5:58 AM GMT
ఎవ‌రో చెబితే త‌గ్గ‌ను, పెర‌గ‌ను-ర‌వితేజ‌
X
కిక్‌-2లో బ‌క్క‌చిక్కిన ర‌వితేజ‌ను చూస్తే అదోలా అనిపించింది జ‌నాల‌కు. మ‌రీ ఇంత బ‌క్క చిక్కిపోతే ఎలా రాజా అన్న కామెంట్లు ప‌డ్డాయి. ఇంత‌లో వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే సినిమా కోసం బ‌రువు పెర‌గాల్సిందిగా దిల్ రాజు ర‌వితేజ‌కు తేల్చిచెప్పాడ‌ని.. ప్ర‌స్తుతం మాస్ రాజా అదే ప‌నిలో ఉన్నాడ‌ని వార్త‌లొచ్చాయి.

ఈ సంగ‌తే ర‌వితేజ ద‌గ్గ‌ర ప్ర‌స్తావిస్తే.. ‘‘ఎక్కువ హ్యాపీగా ఉండటానికే బ‌రువు త‌గ్గా. ఆ మధ్య నేను సన్నబడాలనుకున్న విషయం నాకు క్లోజ్‌ గా ఉన్నవాళ్లందరికీ తెలుసు. నేను మామూలుగానే డిసిప్లిన్ గా ఉంటాను. ఈ మ‌ధ్య మరింత డిసిప్లిన్ గా ఉండి దాదాపు 7,8 కిలోలు తగ్గా. మ‌ళ్లీ నెమ్మ‌దిగా మజిల్స్‌ పెంచుతున్నా. దీనివల్ల బాడీ బాగా టోన్ అవుతుంది. ఇప్పుడు చాలా హ్యాపీగా, లైట్ గా ఉన్నాను. అంతేగానీ ఒకరు చెప్పారని తగ్గడమో, పెరగడమో ఉండదు’’ అని అన్నాడు.

బెంగాల్ టైగ‌ర్ క‌థ‌ను త‌న‌కు సంప‌త్ నంది ఎప్పుడో చెప్పాడ‌ని ర‌వితేజతెలిపాడు.‘‘సంప‌త్ తొలి సినిమా ఏమైంది ఈ వేళ కాన్సెప్ట్‌ నచ్చి అత‌ణ్నిపిలిచి మాట్లాడాను. అప్పుడే నాకు ‘బెంగాల్‌ టైగర్‌’ లైన్ వినిపించాడు. బావుందనుకున్నాం. ఆ తర్వాత మేమిద్దరం ఎవరి కమిట్‌ మెంట్లతో వాళ్ళం బిజీ అయిపోయాం. ఆ మధ్య తను పూర్తి స్ర్కిప్ట్‌ సిద్ధం చేసుకుని వచ్చి చెప్పాడు. కథ నచ్చడంతో వెంటనే ప్రొసీడ్‌ అన్నాను’’ అని చెప్పాడు మాస్ రాజా.