Begin typing your search above and press return to search.
జూ. మాస్ రాజా రింగులోకి!
By: Tupaki Desk | 13 Nov 2018 7:04 AM GMTసినీరంగంలో వారసులు వెల్లువెత్తుతున్న వేళ.. నెప్టోయిజం (వారసత్వ నటుల)పై ఆసక్తికర డిబేట్ రన్ అవుతోంది. అటు బాలీవుడ్ - ఇటు టాలీవుడ్ లో దీనిపై విరివిగానే ముచ్చట సాగుతోంది. కొత్తగా వస్తున్న మెగా మేనల్లుడు 2 వైష్ణవ్ తేజ్ ని కలుపుకుని ఇప్పటికే మెగా కాంపౌండ్ లో 10 మంది హీరోలు ఉన్నారు. అక్కినేని కాంపౌండ్ - నందమూరి కాంపౌండ్ - మంచు కాంపౌండ్ .. అంటూ ఇప్పటికే వారోత్సవ హీరోలు వరదలా వెల్లువెత్తారు.
వీళ్లతో పాటు దర్శకులు - నిర్మాతల వారసులు హీరోలుగా వస్తున్నారు. హీరోల వారసులు హీరోలు.. క్యారెక్టర్ ఆర్టిస్టుల వారసులు హీరోలు.. నటీమణుల పుత్ర రత్నాలు హీరోలు అంటూ బోలెడంత హంగామా నడుస్తోంది. ఈ వెల్లువ ఇప్పట్లో ఆగేది కాదు. పరిశ్రమకు వారసత్వ నటుల రాక అలా సాగుతూనే ఉంటుంది. ఇటీవలే శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్ ఇంటి నుంచి రోషన్ హీరోగా పరిచయం అయ్యాడు. శ్రీకాంత్ నటవారసుడు - చాక్లెట్ బోయ్ రోషన్ 2019 లో కొత్తగా దిగుతున్నాడన్న సమాచారం ఉంది. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ కాంపౌండ్ నుంచి హీరో బరిలోకి దిగబోతున్నాడు. అయితే ఇది వెంటనే కాదు. కాస్త టైమ్ పడుతుందని తెలుస్తోంది. రవితేజ వారసుడు మహాధన్ అచ్చం డాడ్ పోలికలతో ఆరడుగుల బుల్లెట్టులా ఉంటాడు. రవితేజ ను మించిన ఎనర్జీ ఈ కుర్రాడిలో ఉందని అకడమిక్ స్టడీస్ లో స్నేహితుల్లోనూ టాక్ ఉంది.
మాస్ రాజా రవితేజ ఫ్యామిలీ కానీ - మహాధన్ కానీ పెద్దంతగా మీడియాలో హడావుడి కనిపించదు. పబ్లిక్ ఫంక్షన్లకు దూరంగానే ఉంటారు.. అందువల్ల మహాధన్ గురించి విపరీతమైన ప్రచారం లేదు. కానీ గత కొంతకాలంగా అడపాదడపా రవితేజ వారసుని పేరు ప్రముఖంగానే వినిపిస్తోంది. అప్పట్లో `రాజా ది గ్రేట్` టైమ్ లో మహాధన్ పేరు ప్రముఖంగా వినిపించింది. రవితేజ వారసుడొస్తున్నాడు అంటూ ప్రచారం సాగింది. కానీ అప్పటికి ఇంకా బాలా కుమారుడిలా కనిపించడం.. చదువుల్లో బిజీగా ఉండడంతో రవితేజ సైతం ఇంకా రాడనే అన్నారు. మహాధన్ ప్రస్తుతం అకడమిక్ స్టడీతో పాటు.. నట శిక్షణ పైనా శ్రద్ధ పెడుతున్నాడని తెలుస్తోంది. ఓవైపు పెద్ద చదువులపై దృష్టి సారించాడు .. మరోవైపు నటనకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించాడు. అందుకే ఈ ఆలస్యం అని తెలుస్తోంది. వాస్తవానికి మహాధన్ `అమర్ అక్బర్ ఆంటోని`లో నటించాల్సింది .. కానీ జస్ట్ మిస్ అయ్యాడు. యూఎస్ వీసా ఆలస్యం అవ్వడంతో అతడిని బరిలో దించాలన్న ఆశ నెరవేరలేదని శ్రీను వైట్ల చెబుతున్నాడు. మొత్తానికి రాజా కాంపౌండ్ నుంచి కొత్త హీరో ప్రిపేరవుతున్నాడు. కానీ కాస్త ఆగి చూడాలి.