Begin typing your search above and press return to search.

అన్ని ముక్కలు అక్కడే.. అన్నయ్య అంతే కదా..!

By:  Tupaki Desk   |   27 Dec 2022 4:01 PM GMT
అన్ని ముక్కలు అక్కడే.. అన్నయ్య అంతే కదా..!
X
చిరు వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సంక్రాంతి రిలీజ్ కి ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక బద్ధంగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు వాల్తేరు వీరయ్య టీం. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ హడావిడి చేస్తుండగా ఆ మూడు సాంగ్స్ ని అలా వదిలేశాం కాబట్టి ఈసారి ఓ భారీ ప్రెస్ మీట్ పెట్టేద్దాం అనుకున్నారు మేకర్స్. అనుకోవడమే ఆలస్యం ఓ సెట్ వేసి మరీ చిత్రయూనిట్ ని దించేశారు. మంగళవారం సాయంత్రం జరిగిన వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ లో చిరంజీవి, రవితేజ తో సహా సినిమాలో నటించిన నటులందరు పాల్గొన్నారు.

ఇక సినిమా గురించి ఏదైనా మాట్లాడుతారేమో అని మాస్ మహరాజ్ రవితేజకి మైక్ ఇవ్వగా ఒక్క ముక్క కూడా ఇక్కడ లేదు అన్ని ముక్కలు అక్కడే అన్నయ్య అంతే కదా అని పక్కనే ఉన్న చిరంజీవిని అడిగి చెప్పేశారు రవితేజ.

ఆల్రెడీ ధమాకా హిట్ మూడ్ లో ఉన్న రవితేజ వాల్తేరు వీరయ్య వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ఏమైనా చెబుతారు అనుకుంటే అన్ని ముక్కలు ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే అంటూ చెప్పేశారు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా మైక్ ఇవ్వడం కొందరికి నచ్చకపోయినా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతా అంటున్నాడు కదా చూద్దాం అనుకుంటున్నారు మెగా ఫ్యాన్స్.

మొత్తానికి ఈ మెగా వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ మెగా ఫ్యాన్స్ కి సినిమా మీద మరింత హైప్ ఏర్పడేలా చేసింది. ఇక కొద్ది గంటల క్రితమే రిలీజైన టైటిల్ ట్రాక్ కూడా మెగా ఫ్యాన్స్ కి బాగా ఎక్కేసింది. దేవి శ్రీ ప్రసాద్ మళ్లీ మనసు పెట్టి ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడని అనిపించేలా సాంగ్స్ ఉన్నాయి. ఇప్పటికే వీరయ్య సినిమా నుంచి వచ్చిన బాస్ పార్టీ, శ్రీదేవి చిరంజీవి సాంగ్స్ తో పాటుగా ఈ వీరయ్య టైటిల్ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ గా నిలిచేలా ఉంది.

2023 సంక్రాంతికి మెగా ఫ్యాన్స్ కి డబుల్ ఫీస్ట్ అందించేలా వాల్తేరు వీరయ్య రెడీ అవుతుంది. సినిమాలో మెగా ఫ్యాన్స్ కి కావాల్సిన అన్ని అంశాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ బాబీ. మరి మెగా మాస్ మూవీగా వస్తున్న వాల్తేరు వీరయ్య మెగా ఫ్యాన్స్ ఆకలి తీరుస్తుందా లేదా అన్నది తెలియాలంటే పొంగల్ వరకు వెయిట్ చేయక తప్పదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.