Begin typing your search above and press return to search.
నాకున్నంత నోటిదూల అతనికీ ఉంది
By: Tupaki Desk | 15 Oct 2017 7:05 AM GMT‘‘మనకు ప్రొడ్యూసర్స్ చాలామంది ఉన్నారు. కానీ మేకర్స్ చాలా తక్కువమంది ఉన్నారు. అలాంటి వాళ్లలో దిల్ రాజు ఒకరు. సినిమాల విషయంలో అతనికున్న టేస్ట్ - జడ్జిమెంటే వేరు. ప్రతి విషయంలోనూ డే అండ్ నైట్ కష్టపడతారు. ఇంకో నిర్మాత శిరీష్ తో రాజా ది గ్రేట్ షూటింగ్ తో ఇంటరాక్షన్ ఎక్కువైంది. భద్ర సినిమా చేసినప్పుడు అంత లేదు. శిరీష్ లో నాకు నచ్చిన విషయం ఏమిటంటే ఏ విషయమైనా ఫ్రాంక్ గా.. ఓపెన్ గా చెబుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నాకున్నంత నోటిదూల అతనికీ ఉంది’’ తన లేటెస్ట్ సినిమా రాజా ది గ్రేట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రవితేజ చెప్పిన మాటలివి.
ఈమధ్య సినిమాలకు షార్ట్ గ్యాప్ ఇచ్చిన మాస్ మహరాజా రవితేజ రాజా ది గ్రేట్ సినిమాతో కొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. మహానుభావుడులో ఫేం మెహ్రీన్ ఇందులో హీరోయిన్ గా నటించింది. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి - రఘుబాబు -రాజేష్ - ఆలీ వీళ్లందరితో సెట్లో గోలగోలగా ఉండేది. రాజేంద్రప్రసాద్ - రాధికతో కలిసి తొలిసారి నటించాను. వాళ్ల వద్ద ఎంతో నేర్చుకున్నా. మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఫ్యూచర్ లో ఇంకా ఇరగదీస్తాడు. నాకు డూప్ గా చేసే ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ అన్నయ్య కొడుకు వెంకట్ తొలిసారి ఫైట్ మాస్టర్ గా చేశాడు. ఈ సినిమాతో తనకు మంచి పేరొస్తుందని’’ చెప్పుకొచ్చాడు.
ఈ సినిమాలో రవితేజ తన కెరీర్ లో తొలిసారి అంధుడిగా నటించాడు. అయినా కూడా రవితేజ మార్కు హాస్యానికేం లోటుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పాడు. ఇంతకుముందు పటాస్ - సుప్రీమ్ లతో రెండు హిట్లు కొట్టాడు. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతాడని రవితేజ కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. ఈసారి దీపావళి అందరూ థియేటర్లకొచ్చి తనకు వినిపించాలంటూ తన స్వీచ్ కు ఫన్నీ ఎండింగ్ ఇచ్చాడు.