Begin typing your search above and press return to search.
చాలా రోజుల తరువాత రవితేజ మాట్లాడాడు
By: Tupaki Desk | 7 Oct 2017 5:50 AM GMTరవితేజ సినిమా రిలీజ్ అయ్యి 20 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు దీపావళికి రాజా ది గ్రేట్ అంటూ రాబోతోన్నాడు మాస్ మహరాజ్. ఒక కళ్లులేని వాడి పాత్రను హీరోగా చేసి.. అనిల్ రావిపూడి ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టెయినర్ ను రూపొందించగా.. ఇప్పుడు ఆ మూవీ ట్రైలర్ లాంఛ్ ను గ్రాండ్ గా నిర్వహించారు.
ఈ వేడుకలో రవితేజ మాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తను మాట్లాడ్డానికి ఏమీ లేదని.. అందరూ అన్నీ చెప్పేశారని అంటూనే.. తన స్టైల్ లో స్పీచ్ ఇరగదీసేశాడు రవితేజ. 'రాజేంద్ర ప్రసాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే రాధిక గారితో పని చేసే అవకాశం లభించింది. ఈ అనుభవాన్ని మర్చిపోలేదు. సాయికార్తీక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఈ జర్నీ ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా దర్శకుడు అనిల్ రావిపూడికి ఈ చిత్రంతో హ్యాట్రిక్ లభించాలని కోరుకుంటున్నాను. తను ఫుల్ ఎనర్జిటిక్ పర్సన్. తన ఎనర్జీలో సగం ఉన్నా.. నేను సక్సెస్ అయినట్లే అనిపించింది. అంతగా కష్టపడతాడు. ఇరగదీసేశాడంతే' అన్నాడు రవితేజ.
ఇక హీరోయిన్ మెహ్రీన్ గురించి చెబుతూ.. "మెహర్ అద్భుతమైన వ్యక్తి. ఇంకా ఒకట్రెండు సినిమాలతో ఫుల్లుగా తెలుగు మాట్లాడేయడం ఖాయం. ఇప్పటికే మొదలుపెట్టేసింది. తెలుగులో మెహర్ జెండా పాతేయడం ఖాయం" అంటూ తన స్టైల్ లో యాక్షన్ చేసి మరీ చూపించాడు రవితేజ. నిర్మాత దిల్ రాజు చెప్పినట్లు ఈ దీపావళికి దుమ్ము లేచిపోవడం ఖాయమని.. మంచి సినిమాను అందించామని అన్న రవితేజ ఇచ్చిన ఫినిషింగ్ టచ్ అదిరిపోయింది. లాఫింగ్ టైమ్ అంటూ.. 'హుహు..హూ..హు' అని తన స్టైల్ మాడ్యులేషన్ తో మాస్ మహరాజ్ అందరిలోనూ నవ్వులు పూయించేశాడు.