Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ : ఈ వయసులోనూ ఫ్యాన్స్ కు ఆదర్శం
By: Tupaki Desk | 4 Nov 2020 5:30 PM GMTసామాన్యులు అయిదు పదుల వయసుకు వచ్చామంటే ముసలివాళ్లం అయ్యాం.. ఇంకా ఏం చేస్తాం అంటూ రిటైర్మెంట్ తీసుకుంటారు. కాని హీరోలు మాత్రం అలా కాదు. అయిదు పదుల వయసు కాదు ఆరు పదుల వయసు వచ్చినా కూడా మూడు పదుల హీరోలతో పోటీ పడేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారు ఈ వయసులో కూడా ఇంతగా ఎలా కష్టపడుతారో అంటూ ఆశ్చర్యపోయేలా వారి వర్కౌట్ లు చేస్తూ ఉంటారు. తాజాగా రవితేజ షేర్ చేసిన ఒక ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవ్వడంతో పాటు ఆయన అభిమానులకు మరియు యువతకు ఆదర్శంగా నిలుస్తుంది.
రవితేజ అయిదు పదుల వయసు దాటి రెండేళ్లు అయ్యింది. అయినా కూడా ఆయన ఏమాత్రం తగ్గకుండా ఇప్పటికి గంటల తరబడి జిమ్ లో వర్కౌట్లు చేస్తూ ఫిట్ గా ఉంటున్నాడు. హీరో అనేవాడు ఫిట్ గా ఉంటేనే ప్రేక్షకులు ఆధరిస్తారు. ఆ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరు మాత్రం బాబోయ్ మాకు ఎందుకు ఈ ఫిట్ నెస్ అనుకుంటూ ఉంటారు.
రవితేజ మాత్రం ఈ వయసులో కూడా పాతికేళ్ల కుర్రాడి మాదిరిగా తన కొడుకుకు పోటీ అన్నట్లుగా వర్కౌట్లు చేస్తూ మంచి బాడీ మెయింటెన్ చేస్తున్నాడు. రవితేజ నటించిన క్రాక్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. అది కాకుండా మరో రెండు సినిమాల్లో కూడా రవితేజ వచ్చే ఏడాది నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూడు సినిమాలు కూడా 2021లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.