Begin typing your search above and press return to search.
రవితేజ డైరెక్టర్ మామూలోడు కాదు భయ్యో!
By: Tupaki Desk | 27 July 2022 2:30 AM GMTమాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `రామారావు ఆన్ డ్యూటీ`. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ లతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. మాస్ మహారాజా రవితేజ తొలి సారి పవర్ ఫుల్ గవర్నమెంట్ ఆఫీసర్ గా డిప్యూటీ కలెక్టర్ పాత్రలో నటించారు. ఓ సీరియస్ ఇష్యూకు కమర్షియల్ హంగుల్ని జోడించి మరింత పవర్ ఫుల్ గా రూపొందించారు దర్శకుడు శరత్ మండవ.
`జై భీమ్` ఫేమ్ రజీషా విజయన్, `మజిలీ` ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ లుగా నటించారు. ఎల్ ఎల్ వీ సినిమా బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ మూవీని జూలై 29న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ చిత్ర దర్శకుడు శరత్ మండవ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నారు. ఆయనకిది తొలి సినిమా అని అంతా అంటున్నారు. కానీ ఇది ఆయనకు రెండవ సినిమా. 2016లో విడుదలైన `కో 2` మూవీతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అయ్యారు.
జీవా హీరోగా కె.వి. ఆనంద్ 2011లో రూపొందించిన `కో` సినిమాకిది సీక్వెల్. తమిళంలో రూపొందిన ఈ మూవీతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అయ్యారు. తెలుగులో ఆయనకు `రామారావు ఆన్ డ్యూటీ` తొలి సినిమా. అయితే దర్శకుడిగా మాత్రం ఆయనకిది రెండవ సినిమా. కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా, కో డైరెక్టర్ గా పని చేసిన ఆయన `కో 2`తో దర్శకుడిగా పరిచయం అయ్యారు. బాబీసింహా, ప్రకాష్ రాజ్, నిక్కీ గల్రానీ ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా ఫరవాలేదనిపించింది.
దాదాపు 6 ఏళ్ల తరువాత మళ్లీ దర్శకుడిగా `రామారావు ఆన్ డ్యూటీ`తో తెలుగులో పరిచయమవుతున్నారు. గత కొన్నేళ్లుగా పట్టువదలని విక్రమార్కుడిగా రవితేజ చుట్టూ తిరిగి మొత్తానికి ఒప్పించి ఈ సినిమా చేశారు. ఈ చిత్రానికి దర్శకత్వం మాత్రమే కాకుండా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. దీనికి సుధాకర్ చెరుకూరినే ప్రొడ్యూసర్ గా ఎంచుకోవడానికి బలమైన కారణం వుంది. శరత్ మండవ యుఎస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదులుకుని ఇండియాకు వచ్చిన రోజుల్లో చెరుకూరి సుధాకర్ తను రూమ్మేట్స్ అంట. ఆ అనుబంధం వల్లే శరత్ మండవతో ఈ మూవీని సుధాకర్ చెరుకూరి చేస్తున్నారట.
కో 2 తరువాత శరత్ మండవ ఎంటర్ కానీ క్రాఫ్ట్ లేదంటే ఆశ్చర్యంగా అనిపిస్తుందేమో కానీ అది నిజం. ఆయన ప్రొఫైల్ చూస్తూ శరత్ మండవ మామూలోడు కాదు భయ్యో అనాల్సిందే. మంచు మనోజ్ నటించిన `పోటుగాడు`, ఎవడు తక్కువ కాదు సినిమాలకు ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. తమిళ స్టార్ హీరో తల అజిత్ నటించిన `బిల్లా 2` సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా ఓ పాత్రలో నటించారు కూడా. ఇదే సినిమా తెలుగు వెర్షన్ కు డైలాగ్ లు అందించారు.
ఇక ప్రభుదేవా, తమన్నా నటించిన హిందీ సినిమాకు డైలాగ్ లు రాశారు. ఇక ఆర్పీపట్నాయక్ నటించి రూపొందించిన `తులసీదళం`, బ్రోకర్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయడం విశేషం. ఇన్ని శాఖల్లో అనుభవం వున్న శరత్ మండవకు ఇన్నేళ్లకు `రామారావు ఆన్ డ్యూటీ`తో అవకాశం లభించింది. మూవీతో తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చాలా ఏళ్ల తరువాత లభించిన అవకాశాన్ని శరత్ మండవ సద్వినియోగం చేసుకున్నాడా? లేదా ? అన్నవి తెలియాలంటే జూలై 29న విడుదలవుతున్న `రామారావు ఆన్ డ్యూటీ` రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.