Begin typing your search above and press return to search.

చిన్నప్పటి నుండే కాస్త తేడా!!

By:  Tupaki Desk   |   25 Aug 2016 5:30 PM GMT
చిన్నప్పటి నుండే కాస్త తేడా!!
X
''నేను చిన్నప్పటి నుండే కాస్త తేడా. ఇక పెద్దయ్యాక నా పనుల్లో అలాంటి తేడాలు చూపించకుండా.. ఆ తిక్క అంతా సినిమాల్లో చూపిస్తున్నా. నా కథల్లో అవన్నీ కనిపిస్తాయి'' అంటున్నాడు రవిబాబు. ప్రస్తుతం ''అదుగో'' అనే సినిమాతో వస్తున్నాడు రవిబాబు. ఈ సినిమాలో ఒక పంది పిల్ల ప్రధాన పాత్రను పోషిస్తుందిలే. ఒక ఇంటర్యూలో మనోడు తన పర్సనల్ లైఫ్‌ కు చెందిన కొన్ని విషయాలను రివీల్ చేశాడు.

''నాక్కొంచెం అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఉంది. మా ఆవిడ మాత్రం చాలా క్యాజువల్. ఎవరన్నా న్యాప్కిన్ హోల్డర్ లో ఒక న్యాప్కిన్ సరిగ్గా పెట్టకపోయినా నాకు కోపం వచ్చేస్తుంది. అదే మా ఆవిడ అయితే.. అబ్బే అదేముంది.. మనం సరిచేద్దాంలే.. వాడినోళ్ళు సరిగ్గా పెడతారా ఏంటి అంటుంటుంది'' అంటూ తన భార్యకూ తనకూ వచ్చే డిఫరెన్సులు గురించి చెప్పుకొచ్చాడు ఈ దర్శకుడు-నటుడు. తనకూ తన వైఫ్‌ కు ఎంతో అండరస్టాడింగ్ ఉందని.. ఎవరి లైఫ్‌ లో వాళ్లు బిజీగా ఉంటూనే.. తమ దాంపత్య జీవనాన్ని ఎంజాయ్ చేస్తుంటామని తెలిపాడు.

ఇకపోతే పెళ్ళయ్యాక తన తండ్రి ఇచ్చిన ఎడ్వయిజ్ గురించి చెబుతూ.. ''పెళ్లయాక.. పిల్లలూ తల్లిదండ్రులూ.. పక్కపక్కనే ఉండాలి కాని ఒకే ఇంట్లో ఉండకూడదు. పక్కపక్క ఫ్లాట్లలో ఉండాలి. కావాలంటే ఒకే బిల్డింగ్ లో వేర్వేరు ఫ్లోర్స్ లో ఉండాలి. ఎమోషనల్ సపోర్టుకు ఈజీగా అందుబాటులో ఉండాలి. అంతేకాని కలసి ఉండకూడదు. అప్పుడు చాలా గొడవలు అవుతాయి. మా ఇంటికి దగ్గర్లోనే మా వైఫ్‌ ఫ్యామిలీ ఉంటారు. అవసరమైనప్పుడు హెల్ప్ చేస్తారు. అలాగే మా నాన్నగారు కూడా'' అంటూ తన పర్సనల్ లైఫ్‌ కు సంబంధించి కొన్ని డిటైల్స్ ఇచ్చాడు.