Begin typing your search above and press return to search.

సిల్క్ స్మిత చనిపోయే ముందు రోజు ఏమి జరిగింది..?

By:  Tupaki Desk   |   29 April 2020 8:10 AM GMT
సిల్క్ స్మిత చనిపోయే ముందు రోజు ఏమి జరిగింది..?
X
సిల్క్ స్మిత.. ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. 1979లో ఒక మలయాళం సినిమాతో వెండితరకు పరిచయమైన సిల్క్ స్మిత అతి తక్కువ కాలంలోనే ఎవరు ఊహించని క్రేజ్ అందుకుంది. చూస్తుండగానే సౌత్ లో బిజీగా మారిపోయింది. తెలుగమ్మాయిలు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటారనే విమర్శలకి కౌంటర్ ఇచ్చేలా బోల్డ్ రోల్స్ చేసిన డేరింగ్ గర్ల్ సిల్క్ స్మిత. తన నిషా కళ్ళతో సినీ ప్రేక్షకులను కళ్ళు తిప్పనివ్వకుండా చేసింది ఈ భామ. తెలుగు - తమిళం - కన్నడం - మళయాళం మరియు హిందీ భాషలలో 200పైగా సినిమాలలో నటించి తానేంటో నిరూపించుకుంది. ఒకవైపు ప్రధాన పాత్రలను.. ముఖ్యమైన పాత్రలను చేస్తూనే ఐటమ్ సాంగ్స్ తోను అదరగొట్టేసింది. సిల్క్ స్మిత అస‌లు పేరు విజయలక్ష్మి. గ్లామర్ ప్రపంచంలో తనదైన‌ ముద్ర వేసి విజయం సాధించినా.. తన పేరులోని విజయం మాత్రం జీవితంలో చవిచూడలేకపోయింది. అయితే ఎన్నో సినిమాలలో తన అందచందాలతో యాక్టింగ్ తో ప్రేక్షకులను ఫిదా చేసిన సిల్క్ స్మిత మరణం ఇప్పటికే అంతుచిక్కని మిస్టరీనే. కొంతమంది సినిమా నిర్మాణంలో పెద్ద మొత్తంలో పెట్టి నష్టపోయినందుకు స్మిత ఆత్మహత్య చేసుకొన్నారని భావిస్తారు. మరికొంతమంది స్మిత ప్రేమించి విఫలమైన కారణంగా సూసైడ్ చేసుకున్నారని అనుకుంటున్నారు. కానీ కేవ‌లం 35 ఏళ్లకే చనిపోయిన సిల్క్ స్మిత.. తెరపై కనిపించేదంతా అబద్ధమని తన చావు మాత్రమే నిజమనే సంకేతాన్నిచ్చి జీవితాన్ని విషాదాంతం చేసుకుంది. ఆమె జీవితం ఆధారంగా 'డర్టీ పిక్చర్' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆమె గురించి కన్నడ సీనియర్ హీరో రవిచంద్రన్ ప్రస్తావించాడు. 'సిల్క్ స్మిత నాకు మంచి స్నేహితురాలు. తరచూ ఆమె నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేది. అలాగే ఒక రోజున ఆమె నుంచి నాకు కాల్ వచ్చింది. అయితే ఆ సమయంలో నేను బిజీగా ఉండటం వలన తరువాత మాట్లాడవచ్చులే అనుకున్నాను. ఆ మరునాడే ఆమె మరణ వార్తను వినవలసి వచ్చింది. సిల్క్ స్మిత కాల్ చేసినప్పుడు నేను వెంటనే స్పందించి వుంటే పరిస్థితి వేరేలా ఉండేదని ఇప్పటికీ అనుకుంటూ బాధపడుతూ వుంటాను' అని చెప్పుకొచ్చాడు. కన్నడ స్టార్ రవిచంద్రన్ కి సిల్క్ స్మితతో మంచి స్నేహం ఉండేది. ఇక 1992లో సిల్క్ స్మిత రవిచంద్రన్ కలిసి 'హల్లి మేస్త్రు' అనే సినిమాలో న‌టించ‌డంతో.. అప్పట్నుంచే వీళ్ల స్నేహం మ‌రింత బలపడింది. ఇప్పుడు తాజాగా రవిచంద్రన్ వెల్లడించిన విషయాలతో సిల్క్ స్మితని అందరూ మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.