Begin typing your search above and press return to search.
డ్రగ్స్ కేసు: పార్లమెంట్ లో గళమెత్తిన ఎంపీ రవికిషన్
By: Tupaki Desk | 14 Sep 2020 1:00 PM GMTముంబైలో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసును బీజేపీ ఎంపీ, ప్రముఖ నటుడు రవికిషన్ లేవనెత్తారు. రవికిషన్ ఎంపీ కాకముందు తెలుగులో రేసుగుర్రం, సైరా సహా పలు ప్రముఖ చిత్రాల్లో విలన్ గా నటించారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా గెలిచారు.
సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడారు. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న కొంతమందిని అరెస్ట్ చేసి, ఎన్‌సీబీ మంచి పనిచేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని, కేసుతో సంబంధం ఉన్న మిగిలిన దోషులను వెంటనే పట్టుకుని శిక్షించాలని కోరారు.
పాకిస్తాన్, చైనాలనుంచి ప్రతి ఏటా మత్తు పదార్థాలు దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయని, నేపాల్, పంజాబ్ ద్వారా దేశంలోకి వస్తున్నాయని పేర్కొన్నారు. దేశ యువతను నాశనం చేయటానికి కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. పొరుగుదేశాలు ఇందుకు సహకారం అందిస్తున్నాయన్నారు.
సుశాంత్ సింగ్ మరణానికి డ్రగ్స్ కారణంగా అందరూ అనుమానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోయిన్ కంగన ఇప్పటికే మహారాష్ట్ర సర్కార్ పై ఫైట్ చేస్తోంది. దీనికి బీజేపీ కూడా పరోక్ష మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే పార్లమెంట్ లోను సినీ నటుడు అయిన ఎంపీ రవికిషన్ తో డ్రగ్స్ ఇష్యూ ను లేవనెత్తినట్టు తెలుస్తోంది. తద్వారా శివసేనను ఇరుకున పెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తోంది.