Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : అందగత్తె రెచ్చిపోతే ఇలానే ఉంటుంది..!

By:  Tupaki Desk   |   31 Oct 2022 7:30 AM GMT
ఫోటో స్టోరీ : అందగత్తె రెచ్చిపోతే ఇలానే ఉంటుంది..!
X
మళయాళ పరిశ్రమ నుంచి వచ్చి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన బ్యూటీ మాళవిక మోహనన్. మోడల్ గా కెరియర్ మొదలు పెట్టి ఆ పాపులారిటీతో సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ మళయాళంలోనే కాకుండా కన్నడ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తుంది.

ముఖ్యంగా తమిళంలో అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. కోలీవుడ్ లో మాళవిక తన జోరు కొనసాగిస్తుంది. రజినీ పేట.. విజయ్ మాస్టర్.. ధనుష్ తో మారన్ సినిమాల్లో నటించింది మాళవిక. తమిళంలో ఆమెకి సూపర్ క్రేజ్ రాగా తెలుగులో ప్రభాస్, మారుతి కాంబో సినిమాలో ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది.

ఓ పక్క జోరుగా సినిమాలు చేస్తూనే ఆడియన్స్ ని తన హాట్ అటెంప్ట్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది మాళవిక. ఫోటో షూట్స్ అంటే సూపర్ క్రేజ్ ఉన్న ఈ అమ్మడు ఛాన్స్ దొరికితే చాలు తను ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

అయితే గ్లామర్ షో విషయంలో కూడా సినిమాల్లో కాస్త అటు ఇటుగా మొహమాట పడుతున్నా ఫోటో షూట్స్ తో మాత్రం పిచ్చెక్కించేస్తుంది. అమ్మడు చేస్తున్న ఫోటో సూట్స్ కి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. అందాల ప్రదర్శనలో నో లిమిట్స్ అనేలా మాళవిక ఎటాక్ ఉంది. ఇండస్ట్రీలో రోజుకొక హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న ఈ టైం లో నెగ్గుకురావాలంటే రెచ్చిపోక తప్పదు. ఆ విషయంలో మాళవిక రెండు ఆకులు ఎక్కువేఎ చదివేసిందని చెప్పొచ్చు.

లేటెస్ట్ గా తళుకు బెళుకు మెరుపుల డ్రెస్సుతో అందాలని గుమ్మరించేస్తుంది. తన హాట్ అప్పీల్ ఆడియన్స్ ని నిద్రపట్టకుండా చేస్తుంది. మాళవిక ఈ ఫోటో షూట్ చూసి అమ్మడు నీకేమాత్రం జాలి దయా లేవా నువ్విలా రెచ్చిపోతే మాలాంటి సింగిల్స్ పరిస్థితి ఏంటి అని చిలిపి కామెంట్స్ పెట్టేస్తున్నారు.. ఇంకొందరైతే మాళవికకి లవ్ ప్రపోజల్స్ కూడా చెప్పేస్తున్నారు.

నా గుండె గుడిలో దేవత నువ్వే అంటూ క్రేజీ కామెంట్స్ కూడా ఆమె సొంతమవుతున్నాయి. తెలుగులోకి ఎంట్రీ ఇవ్వకపోయినా మాళవికని తెలుగు ఆడియన్స్ కూడా ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఎంట్రీ ఇస్తే మాత్రం అమ్మడి ఇమేజ్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రభాస్ సినిమాకే కాదు మహేష్ నెక్స్ట్ సినిమాకు కూడా మాళవిక డిస్కషన్స్ లో ఉందని టాక్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.