Begin typing your search above and press return to search.
అమర్ అక్బర్ ఆంటోని పై బాలయ్య..రవితేజ సెటైర్లు
By: Tupaki Desk | 2 Jan 2022 5:22 AM GMTమాస్ రాజారవితేజ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన `అమర్ అక్బర్ ఆంటోని` వైఫల్యం గురించి చెప్పాల్సిన పనిలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్. రవితేజకి...శ్రీనువైట్లకి సక్సెస్ అనివార్యమైన సమయంలో రిలీజ్ అయిన సినిమా ఇది. చాలా ఆశలే పెట్టుకున్నారు. కానీ తేడా కొట్టేసింది. దీంతో శ్రీను వైట్ల కోల్కోలేకపోయారు. రవితేజ ఇతర సినిమాలతో బిజీ అయినా శ్రీనువైట్లకి అవకాశమే లేకుండా చేసింది ఆ సినిమా. తాజాగా ఈ సినిమాపై నటసింహ బాలకృష్ణ..రవితేజ సెటైర్లు ఓ రేంజ్ లో వేసారు. బాలయ్య హోస్ట్ గా చేస్తోన్న ఆహా 2.0 ఆన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ కి గెస్ట్ గా విచ్చేసిన రవితేజనే ముందుగా ఆ సినిమా సెటైర్లు వేయడం మొదలు పెట్టారు.
అప్పట్లో నేను ఓ కళాఖండంలో నటించా. దానిపేను `అమర్ అక్బర్ ఆంటోని`. బాలయ్యని మీరు చూడలేదా సినిమాని ప్రశ్నిస్తే.. దానికి సమాధానం కూడా రవితేజనే చెప్పేసారు. మంచి పని చేసారు. మీరేం మిస్ అయిపోలేదు. చూడనవసరం లేదు అనగా..బాలయ్యా రాడ్డా? రాడ్ రంబోలా అంటారు. దీనికి రవితేజ మామూలు రంబోలా కాదు. రాడ్ రంబోలా అంటారు. రాడ్లకే రాడ్ సినిమా అన్నారు. మరోవైపు బాలయ్య పగలబడి నవ్వడం. ఈ సన్నివేశం చూస్తున్నంత సేపు సినిమాని ఇంతగా హేళన చేయాలా? అనే ఫీలింగ్ కలగక మానదు. ప్రేక్షకుల వెర్షన్ లో ఇలాంటి కామెంట్లు సహజం.
కానీ అందులో నటించిన హీరోనే సినిమా గురించి ఇంత నెగిటివ్ గా మాట్లాడటం ఆశ్చర్యకరమైన అంశం. ఆ సినిమా కథ వింది రవితేజ. ఆ కథ నచ్చి అందులో నటించింది రవితేజ. ఇది రాడ్ సినిమా అని హీరోగారికి ముందు తెలియలేదా? అంటూ నెటిజనులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. జయాపజయాలు సహజం. అందుకని ఇలా ఓ హీరోనే ఇలా సినిమాని విమర్శిస్తే దర్శకుడ్ని అవమానపరిచినట్లేనని అభిప్రాయపడుతున్నారు. శ్రీనువైట్ల చెవిన ఈ మాటలు పడితే ఆయన ఎంత బాధపడుతారో? అంటూ మరో నెటి జనుడు కామెంట్ చేసాడు. అన్నట్లు శ్రీనువైట్ల-రవితేజ మంచి స్నేహితులు. ఆ కారణంగానే రవితేజ సినిమా గురించి ఇలా ఓపెన్ అప్ అయిండొచ్చని తెలుస్తోంది.