Begin typing your search above and press return to search.
ఆ రోజులను గుర్తు చేస్తున్న రవితేజ
By: Tupaki Desk | 20 July 2022 3:30 AM GMTఆ భాష.. ఈ భాష అని కాకుండా అన్ని భాషల సినిమా పరిశ్రమల్లో కూడా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు పదుల కోట్ల సినిమాలే భారీ చిత్రాలు అనుకుంటే ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ వద్దకు వస్తున్నాయి. కేవలం బడ్జెట్ పెరగడం మాత్రమే కాకుండా సినిమా మేకింగ్ విషయంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.
ఒకప్పడు హీరోలు ఒకేసారి నాలుగు అయిదు సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకేసారి అన్ని సినిమాలు కాకున్నా కూడా ఏడాదిలో అయిదు నుండి పది సినిమాలు చేసి విడుదల చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. స్టార్ హీరోలు ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమా లు మాత్రమే చేస్తున్నారు. వందల కోట్ల బడ్జెట్ సినిమా అయితే ఏడాది కాకుండా రెండు మూడు సంవత్సరాలు కూడా సమయం తీసుకుంటుంది.
ఆ సినిమాలు చేస్తున్న హీరోలు తదుపరి సినిమాలకు చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. కాని కొందరు హీరోలు మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తమ కెరీర్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. రవితేజ కెరీర్ ఖతం అయ్యింది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా క్రాక్ సినిమా తో మళ్లీ గాడిలో పడ్డాడు. ఇప్పుడు ఆయన జోరు ముందు మరెవ్వరు కూడా సరిపోరు.
ఇటీవలే ఖిలాడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ త్వరలో రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన జాబితాలో ఇంకా ధమాకా.. టైగర్ నాగేశ్వరరావు.. రాక్షసుడు.. మెగా 154.. అనిల్ రావిపూడి సినిమా ఇంకా కొన్ని చర్చల దశలో ఉన్నాయి.
ఒకే సారి ఇన్ని సినిమాలు చేస్తున్న హీరోలు టాలీవుడ్ లో అయితే మరెవ్వరు లేరు. ఆయన జోరు చూస్తుంటే 1980 రోజులు గుర్తుకు వస్తున్నాయి అంటూ టాలీవుడ్ సీనియర్ లు మరియు మీడియా వర్గాల వారు చర్చించుకుంటున్నారు. తక్కువ బడ్జెట్ తో ఇలా ఎక్కువ సినిమాలు చేయడం ద్వారా ఎక్కువ సినిమాలను.. ఎంటర్ టైన్మెంట్ ను ప్రేక్షకులకు అందించవచ్చు అనేది విశ్లేషకుల అభిప్రాయం.
ఆ రోజులను కేవలం రవితేజ మాత్రమే కాకుండా అందరూ కూడా మళ్లీ గుర్తు చేసే విధంగా సినిమాలు చేయాలని.. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేయాలి.. అప్పుడే బాక్సాఫీస్ కళకళ గా ఉంటుంది. బడ్జెట్ తగ్గించుకుంటే ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేయడంలో ఇబ్బంది ఏమీ ఉండదు. ఇండస్ట్రీతో పాటు అందరికీ కూడా మంచిది. రవితేజ ను ఎంత మంది హీరోలు ఫాలో అవుతారో చూడాలి.