Begin typing your search above and press return to search.
రవితేజ మూవీ..ఆగిందా? వాళ్లే ఆపేశారా?
By: Tupaki Desk | 18 Oct 2016 5:30 PM GMTమాస్ మహరాజ్ రవితేజతో పవర్ మూవీ చేసి.. డైరెక్టర్ గా మారాడు రైటర్ బాబీ. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ తీయడంతో.. బాబీ పేరు మార్మోగిపోయింది. సర్దార్ డిజాస్టర్ కావడం.. ఆ తర్వాత బాబీ కొన్నాళ్లు సైలెంట్ అవడం.. మళ్లీ రవితేజ నుంచి పిలుపుతోపాటు ఆఫర్ కూడా రావడం జరిగిపోయాయి. ఆదితో చుట్టాలబ్బాయి తీసిన నిర్మాత రామ్ తుళ్లూరి.. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు.
కానీ ఈ ప్రాజెక్టు ఆగిపోయిందంటూ ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం.. రెమ్యూనరేషన్ లే అని అంటున్నారు. పవర్ కు 60 లక్షలు అందుకున్న బాబీ.. సర్దార్ కు ఎంత తీసుకున్నాడో డీటైల్స్ లేవు. కానీ రవితేజతో సినిమాకు 2 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. స్క్రీన్ ప్లే-డైరెక్షన్ తనదే కాబట్టి.. ఆమొత్తం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నాడట. మరోవైపు స్టోరీ-డైలాగ్స్ అందిస్తున్న కోన అండ్ కో 1.5 కోట్లు ప్లస్ హిందీ రీమేక్ రైట్స్ ఇచ్చేయాలని అన్నారట. ఆ లెక్కన స్టోరీ-డైలాగ్స్-స్క్రీన్ ప్లే-డైరెక్షన్ కోసమే లెక్క 4 కోట్లు దాటిందన్న మాట.
ఇక రవితేజకు.. హీరోయిన్లకు.. ఇతర కేరక్టర్ ఆర్టిస్టులకు ఇచ్చే రెమ్యూనరేషన్ లన్నీ కలిపి 15 కోట్లకు బడ్జెట్ చేరింది. దీనికి ప్రొడక్షన్ కాస్ట్ అదనం. రవితేజతో సినిమాకి ఇంతకు మించి వసూలు చేసుకోవడంలో ఉన్న రిస్క్ ను బేస్ చేసుకునే గతంలో ఎవడో ఒకడు.. రాబిన్ హుడ్ లు ఆగిపోయాయి. ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ కూడా రవితేజ-బాబీల ప్రాజెక్టును అటకెక్కించాలనే నిర్ణయానికి వచ్చాడట. ఇంతకీ ఈ సినిమా ఆగిపోతే ఆగిపోయినట్లా.. తమ స్థాయికి మించిన డిమాండ్లతో వీళ్లంతా కలిసి ఆపేసినట్లా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/