Begin typing your search above and press return to search.

స్కామ్ చేసేది బన్నీ కాదు రవితేజ

By:  Tupaki Desk   |   4 March 2016 10:07 AM GMT
స్కామ్ చేసేది బన్నీ కాదు రవితేజ
X
కోలీవుడ్ లో సైలెంట్ హిట్ అయిన కణితన్ మూవీని తెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు బాగానే జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ రీమేక్ లో బన్నీ చేయబోతున్నాడంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు కణితన్ రీమేక్ లో నటించనున్నది బన్నీ కాదని.. మాస్ మహరాజ్ రవితేజ అని తెలిపోయింది. విద్యారంగంలో స్కాముపై ఈ కణితన్ మూవీ తిరుగుతుంది. నకిలీ సర్టిఫికేట్ల భాగోతంపై ఈ మూవీ స్టోరీ ఉంటుంది.

ఈ మూవీ ఒరిజినల్ ని డైరెక్ట్ చేసిన టీఎన్ సంతోష్.. తెలుగు వెర్షన్ ని కూడా తీయనున్నాడు. ఇప్పటికే రవితేజ ను కలిసిన సంతోష్.. స్టోరీతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర డీటైల్స్ ను కూడా వివరించాడు. అయితే రవితేజ ఈ మూవీలో నటించేందుకు యాక్సెప్ట్ చేసినా.. తెలుగు ఆడియన్స్ కి, తన ఎనర్జీకి తగ్గట్లుగా కొన్ని మార్పులను సూచించాడట. దీంతో ఇప్పుడా డైరెక్టర్.. ఛేంజెస్ చేసే పనిలో బిజీ అయిపోయాడు.

మాస్ మహరాజ్ నటించిన చివరి మూవీ బెంగాల్ టైగర్ హిట్ అయినా.. ఇప్పటి వరకూ కొత్త సినిమా స్టార్ట్ చేయలేదీ హీరో. చాలా కథలను వింటున్నా, ఇంకా షూటింగ్ పనులు మాత్రం మొదలుపెట్టలేదు. ఇప్పుడు కోలీవుడ్ కణితన్ రీమేక్ ని వచ్చే ఏడాది ప్రారంభంలో స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఈలోగా రవితేజ రెండు ప్రాజెక్టులను కంప్లీట్ చేయనున్నాడు.