Begin typing your search above and press return to search.
మాఫియా డాన్ గా మాస్ రాజా
By: Tupaki Desk | 17 Nov 2015 3:30 PM GMTఈసారి చేయబోయే సినిమా ఇంకా డేరింగ్ అండ్ డ్యాషింగ్ గా ఉండాలని కోరుకుంన్నాడు మాస్ రాజా. ఎందుకంటే ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కామెడీ కామెడీగానే ఉన్నాయ్. ఎప్పుడో విక్రమార్కుడు సినిమాలో ఒక సీరియస్ రోల్ చేశాడు. ఆ తరువాత అలాంటి రోల్ ఏదీ చెయ్యలేదు. అన్నీ ఊర మాస్ కామెడీ పాత్రలే. అందుకే రూటు మార్చాలని చూస్తున్నాడట.
ప్రస్తుతం 'ఎవడో ఒకడు' అనే కామెడీ ఫిలిం షూటింగ్ లో బిజీగా ఉన్న రవితేజ.. బెంగాళ్ టైగర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమా కనుక హిట్టయ్యిందంటే.. రవి మళ్ళీ స్పీడ్ పెంచేస్తాడట. ఒకవేళ తేడా పడితే మాత్రం అడుగులు జాగ్రత్తగా వేయాల్సిందే. ఎందుకంటే కిక్ 2 లో మనోడి సన్నని లుక్ పైగా ఆ సినిమా కంటెంట్ ఫెయిల్యూర్ క్రియేట్ చేసిన నెగెటివ్ ఎఫెక్టు అలా ఉంది మరి. ఒకవేళ టైగర్ జెండా ఎగరేస్తే మాత్రం.. అప్పుడు రవితేజ చేయబోయే సినిమా ఏంటో తెలుసా?
స్వామి రారా సినిమాను తీసిన సుధీర్ వర్మ అనే దర్శకుడు.. రెండో సినిమాగా నాగ చైతన్యతో దోచెయ్ తీసి.. ఫ్లాపయ్యాడు. ఆ దర్శకుడు ఇప్పుడు రవితేజ కోసం ఒక డబుల్ యాక్షన్ స్టోరీ తయారు చేశాడట. ఇందులో తండ్రి రవితేజ ఒక డాన్ అయితే.. కొడుకు రవితేజ ఒక పోలీస్.. అయితే ఇది తమిళంలో ఈ మధ్యనే వచ్చిన విజయ్ 'జిల్లా' కథలా ఉన్నా.. ఇది పూర్తిగా డిఫరెంట్ పంథాలో సాగే స్టోరి. అందుకే మాస్ రాజాకు తెగ నచ్చేసిందట. కాకపోతే బెంగాళ్ టైగర్ రిజల్టు బట్టి ఈ ప్రాజెక్టుతో ముందుకు వెళదాం అని డిసైడయ్యాడని తెలుస్తోంది.