Begin typing your search above and press return to search.

మాస్ రాజా పిచ్చెక్కిస్తున్నాడుగా..

By:  Tupaki Desk   |   1 Aug 2015 3:32 PM GMT
మాస్ రాజా పిచ్చెక్కిస్తున్నాడుగా..
X
వాయిదాల మీద వాయిదా పడి ఎట్టకేలకు ఆగస్టు 21న రిలీజ్ కు రెడీ అయిపోతోంది కిక్-2 మూవీ. డైరెక్టర్ సురేందర్ రెడ్డే స్వయంగా రిలీజ్ డేట్ ఇచ్చేయడంతో రిలీజ్ పక్కా అనుకోవచ్చు. సినిమా ప్రమోషన్స్ కూడా నెమ్మదిగా ఊపందుకుంటుండంతో 21న ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా విడుదలయ్యేలా కనిపిస్తోంది.

రెండు రోజుల నుంచి ట్విట్టర్లో మాస్ రాజా హంగామా కనిపిస్తోంది. కిక్-2కు సంబంధించిన స్టైలిష్, హాట్ లుక్స్ ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. మొన్న డ్యాన్సర్లతో కలిసి రవితేజ డ్యాన్స్ చేస్తున్న ఫొటో ఒకటి షేర్ చేశారు. తాజాగా రకుల్ ప్రీత్ పిచ్చ హాట్ గా కనిపిస్తున్న ఇంకో పిక్ బయటికి వచ్చింది. ఈ ఫొటోలు చూస్తుంటే అభిమానులకు పిచ్చ కిక్ వచ్చేస్తోందనడంలో సందేహం లేదు.

ఆరేళ్ల కిందట వచ్చిన కిక్ అప్పట్లో పెద్ద సంచలనం. స్టార్ హీరోలందరూ ఎంటర్టైన్మెంట్ బాట పట్టడానికి దోహదం చేసిన సినిమాల్లో ఇదొకటి. యాక్షన్ డైరెక్టర్ గా పేరున్న సురేందర్ రెడ్డి కూడా ఈ సినిమాతో రూటు మార్చేశాడు. ఐతే కిక్-2లో వినోదం కంటే యాక్షన్ మీదే ఎక్కువ దృష్టిపెట్టినట్లు ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటనదగ్గ ఈ సినిమా రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అంటున్నాడు సురేందర్.