Begin typing your search above and press return to search.

రాబిన్‌ హుడ్‌ ఇచ్చే కిక్కే వేరు -రవితేజ

By:  Tupaki Desk   |   18 Aug 2015 3:51 PM GMT
రాబిన్‌ హుడ్‌ ఇచ్చే కిక్కే వేరు -రవితేజ
X
రవితేజ హీరోగా కిక్‌ సూపర్‌ హిట్‌. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కించారని సాగుతున్న ప్రచారం కరెక్ట్‌ కాదు. అసలు ఇది సీక్వెల్‌ కానే కాదు. ఇదో డిఫరెంట్‌ స్టోరీ. అయితే అది డబుల్‌ కిక్‌ ఇచ్చేలా ఉంటుందని మాస్‌ రాజా చెబుతున్నారు. అక్కడ కిక్కు కోసం వెకిలి పనులు చేస్తే, ఇక్కడ కంఫర్ట్‌ నెస్‌ కోసం కిక్కిచ్చే పనులు చేస్తాడు హీరో. అదీ డిఫరెన్స్‌ అంటూ క్లారిటీనిచ్చాడు. ఇంకా ఏం చెప్పారంటే?

=కిక్‌ కథ వేరు. కిక్‌ 2 కథ వేరు. రెండూ డిఫరెంట్‌ స్టోరీస్‌. క్యారెక్టర్‌ షేడ్‌ మాత్రమే ఒకేలా ఉంటుంది.

=ఓ వ్యక్తి తన కంఫర్ట్‌ కోసం కథని ఎలా నడిపించాడన్నదే సినిమా. కెరీర్‌ లోనే అత్యధిక బడ్జెట్‌ తో తెరకెక్కించిన సినిమా. రాబిన్‌ హుడ్‌ తరహాలో కనిపిస్తా.

=ఈ సినిమా కోసమే బరువు తగ్గలేడు. ఆరోగ్యం కోసం బరువు తగ్గాను. 82 కేజీల నుంచి 72 కేజీలకు తగ్గా. ఆ ప్రాసెస్‌ లో ఉండగా కిక్‌2 సెట్స్‌ కెళ్లింది .. కాబట్టి తక్కువ బరువుతో కనిపించానంతే.

=కిక్‌ చేసేప్పుడు కిక్‌ 2 చేయాలనుకోలేదు. కాకపోతే ఎండింగ్‌ ని బట్టి కిక్‌ 2 ఉంటుందని అంతా అంచనా వేశారు.అదే ప్రచారమైంది. ప్రచారమైందే నిజమైంది. వక్కంతం వంశీ చెప్పిన ఓ లైన్‌ ఆకట్టుకుంది. దాన్నే డెవలప్‌ చేస్తే కిక్‌ 2 అయ్యింది. అదీ సంగతి.

=బాహుబలితో తెలుగువాడి గౌరవం ఉత్తరాదిన పెరిగింది. బాహుబలి, శ్రీమంతుడు కొత్త మార్కెట్‌ కి తలుపులు తెరిచాయి. ఇది మంచి పరిణామం.

= ఈ రెండు సినిమాలతో పాటు రాజ్‌ తరుణ్‌ నటించిన సినిమా చూపిస్త మావ చూశాను. చాలా బావుంది. రాజ్‌ తరుణ్‌ చాలా బాగా నటించాడు. నవతరం దూసుకు రావాలి.

=యువహీరోలు నన్ను ఇమ్మిటేట్‌ చేయడం కాదు. నాది ఫ్రీ యాక్టింగ్‌ స్టయిల్‌. అది అలవాటు చేసింది పూరీగారు. ఆ క్రెడిట్‌ ఆయనకే ఇవ్వాలి.

=ఇడియట్‌ తర్వాత ఇడియట్‌ 2 చేద్దామనుకున్నా కుదరలేదు. కిక్‌ 2 తర్వాత కుదిరినా కుదరొచ్చు. పూరితో పనిచేసి చాలా కాలమైంది. వచ్చే ఏడాది కలిసి పనిచేసే అవకాశం ఉంది.

=మల్టీస్టారర్లకు సిద్ధమే. వెంకీ తో వీరూపోట్ల దర్శకత్వంలో చేయాల్సింది. కానీ కుదరలేదు.

=కిక్‌ 2 తొలికాపీ ఇంకా చూడలేదు. కానీ అందరికీ నచ్చే సినిమా ఇది. డబుల్‌ కిక్‌ షురూ.. మనోజ్‌ పరమహంస కెమెరా, రామ్‌ లక్ష్మణ్‌ ఫైట్స్‌ అస్సెట్స్‌.

=బెంగాళ్‌ టైగర్‌ చిత్రీకరణలో ఉంది. సెప్టెంబర్‌ చివరిలో లేదా అక్టోబర్‌ లో రిలీజవుతుంది