Begin typing your search above and press return to search.
1150 ధియేటర్లు.. 30.25 కోట్ల టార్గెట్
By: Tupaki Desk | 20 Aug 2015 2:31 PM GMTమాస్ మహరాజా పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడు. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ లాంఛ్ చేయబోతున్నాడు లేటెస్ట్ మూవీని. ఏకంగా 1150 థియేటర్ల లో కిక్ 2 ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాని సేఫ్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేయాలంటే 30.25 కోట్ల రూపాయలు షేర్ రూపంలోనే రావాలి. గతేడాది మన మాస్ రాజా మూవీ పవర్ పాతిక కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పుడు కిక్ సీక్వెల్ అంతకు మించిన కలెక్షన్స్ తెచ్చుకోవాల్సిందే. అందుకే ఇంత పెద్ద స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు ప్రొడ్యూసర్స్.
హీరో మాస్ ఫాలోయింగ్ కి తోడూ.. సురేందర్ రెడ్డి డైరెక్షన్, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాత కావడంతో.... నమ్మకంతో బయ్యర్లు ఎక్కువ రేటు చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఇప్పటికే ఈ మూవీ శాటిలైట్ హక్కులను 7.2 కోట్లకు విక్రయించగా.. ఆడియో రైట్స్ ద్వారా 30లక్షలు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణల్లో 700 థియేటర్స్ తో పాటు.. దేశంలో మరో 275 స్క్రీన్లు, విదేశాల్లో 175 స్క్రీన్ల లోనూ ప్రదర్శించనున్నారు. మొదటి రోజు టాక్ ను బట్టి... స్క్రీన్స్ సంఖ్య పెరిగే అవకాశముంది. ఇన్ని థియేటర్స్ లో రిలీజ్ కావడం, సోలోగా వస్తుండడం.. మాస్ మహరాజాకు కలిసొచ్చే అంశమే. మూవీలో కాస్త పట్టుంటే చాలు.. కలెక్షన్స్ కొల్లగొట్టేసుకుపోవచ్చు.