Begin typing your search above and press return to search.
కిక్-2కు స్వాతంత్ర్యం సిద్ధిస్తోంది
By: Tupaki Desk | 17 July 2015 9:22 AM GMTఎప్పుడో మేలో విడుదల కావాల్సిన సినిమా కిక్-2. బాహుబలి, రుద్రమదేవి సినిమాల్లాగా అందులో భారీ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఏమీ లేవు. పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడానికి. మరి విడుదల అన్నిసార్లు వాయిదా పడటానికి కారణాలేంటో డైరెక్టర్ సురేందర్ రెడ్డి, ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ లకే తెలియాలి. సొంత సమస్యలన్నీ పరిష్కరించుకుని ఇక రిలీజ్ కు రెడీ అనుకునే సమయానికి బాహుబలి, శ్రీమంతుడు.. ఓ నెలన్నర రోజులు మరో పెద్ద సినిమా ఏదీ విడుదల కాకుండా బ్లాక్ చేసి పడేశాయి. దీంతో ఆగస్టు ద్వితీయార్ధానికి కానీ సినిమాను విడుదల చేసుకోలేని పరిస్థితి.
ఐతే అయిన లేటేదో అయింది కాబట్టి.. శ్రీమంతుడు వచ్చాక మాత్రం ఆలస్యం చేయకూడదనుకుంటున్నాడు కళ్యాణ్ రామ్. మహేష్ సినిమా వచ్చిన తర్వాతి వారం అంటే ఆగస్టు 14న కిక్-2 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. అంటే ఎట్టకేలకు స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు కిక్-2కు స్వాతంత్ర్యం సిద్ధించబోతోందన్నమాట. సినిమా లేట్ అయినప్పటికీ ఔట్ పుట్ విషయంలో మాత్రం యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఆరేళ్ల కిందట వచ్చిన కిక్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. కిక్-2 అని టైటిల్ పెట్టుకున్నప్పటికీ ఆ కథకు, దీనికి ఏమాత్రం సంబంధం లేదని.. ఇది ప్రేక్షకులకు డబుల్ కిక్ ఇస్తుందని చెబుతున్నాడు సురేందర్ రెడ్డి. రవితేజ సరసన రకుల్ ప్రీత్ నటించిన ఈ సినిమాలో ‘రేసుగుర్రం’ ఫేమ్ రవికిషన్ విలన్‌గా నటించాడు.