Begin typing your search above and press return to search.
మనోడి స్లిమ్ లుక్ కిక్కోకిక్కు
By: Tupaki Desk | 21 Aug 2015 11:47 AM GMTమాస్ మహరాజ్ ఇంత స్లిమ్మయిపోయాడేంటి? 80కేజీల నుంచి 70కేజీలకు తగ్గిపోవాల్సిన అవసరం ఏంటి? అంటూ కామెంట్లు వినిపించాయి. అయితే అవన్నీ కిక్ 2 రిలీజ్ కి ముందు. అప్పుడు అలా అన్నవారంతా ఇప్పుడు మౌత్ లు మూయాల్సొస్తోంది. రవి తెరపై మునుపటి కంటే తేజంగా కనిపించాడు. కిక్ 2 సినిమా కథేమో గానీ రవితేజ లుక్కే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యింది. ఒక్కో ఫ్రేములో అతడు సన్నజాజి తీగ లాగా, మెరుపు తీగలాగా కనిపించాడు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో ఉరుమొచ్చి మెరుపుమీద పడ్డట్టు కనిపించాడంటే మారిన రూపం వల్లే. ఇతడింకా యంగ్ బోయ్.. ఆమాత్రం ఎగిరెగిరి కొడిగే తప్పేంలేదు అని ఆడియెన్ కి అనిపించింది. అందుకే యాక్షన్ సీన్స్ లో ఆడియెన్ తల తిప్పకుండా రవితేజనే చూశారు.
అంతేనా ఈ చిత్రంలో రకూల్ ప్రీత్ కూడా సన్నజాజి సోయగంలానే కనిపించింది. తన పక్కన మాస్ రాజా ఎలా కనిపిస్తాడో? అనుకున్నవాళ్లకు పెర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యాడే అనిపించింది. అలా అనిపించడానికి కారణం ఈ స్లిమ్ లుక్కే. వయసు, దాంతో పాటే వచ్చే వార్థక్యం ఎక్కడా కనిపించనీయకుండా రాజా భలే ఫార్ములానే అప్లయ్ చేశాడు. మొత్తానికి ఈ న్యూలుక్ బావుందన్న టాక్ వచ్చింది కాబట్టి ఇకముందు ఇలానే ఆర్గానిక్ ఫుడ్ తింటూ ఇంతే స్లిమ్ గా మెయింటెయిన్ చేయాలని కోరుకుంది.
అంతేకాదండోయ్.. కిక్2లో ఓ చోట చొక్కా విప్పి కనిపించాడు. ఆ లుక్ లో తీర్చిదిద్దిన దేహశిరులు నిజంగానే మగువల గుండెల్లో గుబులు పుట్టించి ఉండాలి. జిమ్ము గట్రా బాగానే చేస్తున్నావు గురూ! యోగా, మెడిటేషన్, డైట్ తో కొడుతున్నావన్నమాట!