Begin typing your search above and press return to search.
మాస్ రాజాను మరిచిపోకండి బాస్
By: Tupaki Desk | 8 Jun 2017 6:44 AM GMTకొన్నేళ్ల కిందట్నుంచి సంవత్సరానికి రెండు సినిమాల చొప్పున చేసుకుంటూ వచ్చిన మాస్ రాజా రవితేజకు ఉన్నట్లుండి గత ఏడాది కెరీర్లో పెద్ద గ్యాప్ వచ్చేసింది. 2015 చివర్లో ‘బెంగాల్ టైగర్’ విడుదలయ్యాక ఇప్పటిదాకా మాస్ రాజా సినిమానే విడుదల కాలేదు. అసలు పోయినేడాదంతా రవితేజ ఓ సినిమా షూటింగ్ లోనూ పాల్గొనలేదు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో.. బాబీ డైరెక్షన్లో అనుకున్న సినిమాలు ప్రారంభం కాకముందే ఆగిపోవడంతో మాస్ రాజా ఖాళీగా ఉండిపోయాడు. ఐతే ఈ ఏడాది ఒకటికి రెండు సినిమాలు మొదలుపెట్టిన మాస్ రాజా సమాంతరంగా ఆ సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఒకటి.. టచ్ చేసి చూడు. కొత్త దర్శకుడు విక్రమ్ సిరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
‘టచ్ చేసి చూడు’ షూటింగ్ సగానికి పైగా పూర్తయిందని.. ఈ సినిమా సెప్టెంబర్లో విడుదలవుతుందన్నది తాజా సమాచారం. సెప్టెంబరు 7 లేదా 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఇప్పటికే దసరా సీజన్ కోసం మూడు నాలుగు సినిమాలు భారీ సినిమాలు రేసులో ఉన్నాయి. ఎన్టీఆర్ సినిమా ‘జై లవకుశ’ సెప్టెంబరు 1న విడుదలయ్యే అవకాశముండగా.. 29న బాలయ్య-పూరిల మూవీ షెడ్యూల్ అయి ఉంది. మహేష్ బాబు స్పైడర్ సెప్టెంబరు మూడో వారంలో వచ్చే అవకాశముంది. రామ్ చరణ్-సుకమార్ సినిమా కూడా సెప్టెంబరులోనే వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. పవన్-త్రివిక్రమ్ సినిమా కూడా ముందు సెప్టెంబరులోనే అన్నారు కానీ.. తర్వాత సంక్రాంతికి వాయిదా అంటున్నారు. కనీసం మూడు భారీ సినిమాలు సెప్టెంబరుకు ఖాయమే అన్నమాట. వాటి మధ్య మాస్ రాజా సినిమా ఏమేరకు సత్తా చాటుకుంటుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/