Begin typing your search above and press return to search.
మాస్ రాజా బాలీవుడ్ ఎంట్రీకి పక్కా ప్లాన్
By: Tupaki Desk | 25 Jan 2022 11:30 AM GMTటాలీవుడ్ లో ఎక్కడా చూసినా, ఎక్కడ విన్నా ప్రముఖంగా వినిపిస్తున్న మాట `పాన్ ఇండియా.. పాన్ ఇండియా... `బాహుబలి` తరువాత తెలుగు సినిమా క్రేజ్ పతాక స్థాయికి చేరడం, మార్కెట్ స్థాయి కూడా భారీగా పెరగిపోవడంతో మన స్టార్ హీరోల్లో చాలా మంది పాన్ ఇండియా లెవెల్లో తమ మార్కెట్ ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే కొంత మంది ఆ వైపుగా అడుగులు వేస్తుండటంతో మరి కొంత మంది పాన్ ఇండియా స్థాయి గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప ది రైజ్` దక్షిణాదితో పాటు నార్త్ లోనూ సంచలనాలు సృష్టిస్తూ హిందీ వెర్షన్ ఏకంగా 85 కోట్లు కొల్లగొట్టడంతో మన వాళ్లలో మరింత ధైర్యం పెరిగింది. ఈ మూవీ ఇచ్చిన సపోర్ట్ తో మరి కొంత మంది హీరోలు నార్త్‌లోనూ పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న వారాల్లో హిందీ నుంచి ఏ సినిమా విడుదల కావడంలేదు. దీంతో మన హీరోలు తమ చిత్రాల హిందీ వెర్షన్ లని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
తాజాగా ఈ జాబితాలోకి మాస్ మహారాజా రవితేజ కూడా చేరిపోయారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `ఖిలాడీ`. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఆయనతో కలిసి బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతీ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ రెండు పాత్రలు చాలా కొత్తగా వుండబోతున్నాయి.
పైగా ఇందులో బాలీవుడ్ నటులు ముఖేష్ రుషి, నికితిన్ ధీర్, సచిన్ ఖేడేకర్, ఠాకూర్ అనూప్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తుండం, ఈ చిత్రంలోని కథ, కథనం బాలీవుడ్ ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుందని రవితేజ, మేకర్స్ బలంగా నమ్ముతున్నారట. ఆ కారణంగానే ఈ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ ని భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో రవితేజ నటించిన చిత్రాలేవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ థియేటర్లలో విడుదల కాలేదు ఇదే తొలిసారి. దీంతో `ఖలాడీ` చిత్రాన్ని హిందీలోనూ `పుష్ప` తరహాలో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారని తెలిసింది. పెన్ స్టూడియోస్ కి ఉత్తరాదిలో మంచి పట్టుంది. వారి కారణంగానే `ఖిలాడీ`ని ఉత్తరాదిలో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారట.
ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11న విడుదల చేస్తున్నామంటూ మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్ ని మరో సారి రిలీజ్ చేశారు కూడా. ఇదే తేదీన `ఖిలాడీ` హిందీ వెర్షన్ ని కూడా విడుదల చేయబోతున్నారట. తొలిసారి ఉత్తరాది థియేటర్లలో విడుదల కానున్న రవితేజ `ఖిలాడీ` అక్కడ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందన్నది తెలియాంటే ఫిబ్రవరి 11 వరకు వేచి చూడాల్సిందే.