Begin typing your search above and press return to search.

మాస్ రాజా ముందే చెప్పాడంట సుమీ..!

By:  Tupaki Desk   |   27 Aug 2015 6:07 AM GMT
మాస్ రాజా ముందే చెప్పాడంట సుమీ..!
X
హీరోల జోక్యం సినిమాల్లో ఎక్కువ ఉంటుందని కొంతమంది దర్శకులు గగ్గోలు పెడుతుంటారు కానీ, కొన్ని సందర్భాల్లో ఒక్కసారి వారి చెప్పేది వినడం కూడా ఎంతో మంచిది. ఎలాగో అంతిమ నిర్ణయం దర్శకుడిదే కదా..! అలా వినిపించుకోవడం వల్ల కొన్నిసార్లు ఫలితాలు తారుమారవుతాయి. కిక్ 2 విషయంలో జరిగిందదే. వివరాల్లోకెళితే...

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన కిక్ 2 సినిమా మొన్నటి శుక్రవారం విడుదలయింది. తొలి ఆట నుండి అందరి నోటా వినపడిన మాట ఒకటే - సాగదీత అని. ఈ విషయాన్ని సినిమా ఫైనల్ కాపీ చూసిన మన మాస్ రాజా ముందే చెప్పాడట. అయితే దర్శకుడు సురేందర్ రెడ్డి వింటేగా..? అంతా బానే వుందని రవితేజకే సర్దిచెప్పి పంపేశాడట. బాధ పడితే కానీ బోధపడదు అన్నట్టు తర్వాత 20 నిమిషాల నిడివి తగ్గించారు. ఈ పనేదో ముందే చేసుంటే ఇంతవరకూ వచ్చేది కాదు కదా.. రవితేజ కెప్టెన్ కుర్చీ ఎక్కకపోయినా ఒకప్పుడు ఆ కుర్చీ పట్టుకుని వున్నవాడే మరి. సురేందర్ రెడ్డి మళ్ళీ హిట్ రేస్ మొదలెట్టే వరకూ ఈ మచ్చ ఇలాగే వుంటుంది. ఆయన మాట ఎలా వున్నా మన మాస్ రాజా మాత్రం త్వరలోనే బెంగాల్ టైగర్ సినిమాతో కిక్ 2 ఫలితాన్ని మరిచిపోయేంత కంఫర్ట్ ఇస్తానని చెబుతున్నాడు. కిక్ 3 ఖచ్చితంగా వుంటుందని చెప్పడం కొసమెరుపు.