Begin typing your search above and press return to search.

సెల్ఫీ టాక్: మాస్ రాజా విత్ ఫ్యామిలీ

By:  Tupaki Desk   |   31 Jan 2017 4:13 PM GMT
సెల్ఫీ టాక్: మాస్ రాజా విత్ ఫ్యామిలీ
X
అసలు ఇప్పటివరకు మాస్ రాజా తన పిల్లలను కాని.. భార్యను కాని.. పబ్లిక్ గా తీసుకొచ్చి ఫ్యాన్స్ కు ఎప్పుడూ ఇంట్రొడ్యూస్ చేయలేదు. అయితే మనోడికి స్టార్డమ్ రాక మునుపే పెళ్ళయ్యంది కాబట్టి.. బహుశా అలాంటి సందర్భంగా కూడా ఎప్పుడూ రాలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు సడన్ గా తన ఫ్యామిలీ ఫోటో ఒకటి షేర్ చేశాడు రచ్చ లేపుతున్నాడు రవితేజ.

అదిగో చూస్తున్నారుగా.. తన భార్య కళ్యాణి తేజతో మన భూపతిరాజు రవిశంకర్ రాజు.. అదేనండీ రవితేజ.. చాలా కిక్కిచ్చే సెల్ఫీ ఒకటి దిగేసి.. దానిని తానే ఫేస్ బుక్ లో కూడా పోస్ట్ చేసేశాడు. అలాగే ఆ ఫోటోలో మనం రవితేజ కొడుకు మహాదన్.. అలాగే కూతురు మోక్షదలను కూడా చూడొచ్చు. అసలు ఎప్పుడూ ఫ్యామిలీని పెద్దగా ఎవ్వరికీ ఇంట్రొడ్యూస్ చేయని రవితేజ.. ఈ ఒక్క ఫోటోతో తన ఫ్యాన్స్ కు టాప్ లేచిపోయే కిక్కిచ్చాడని చెప్పాలి. చూస్తుంటే రవితేజ కూతురు అండ్ కొడుకు కళ్ళలో ఆ ఎనర్జీ ఫుల్లుగా కనిపించేస్తోంది కదూ.

ఇకపోతే రవితేజ మొన్ననే రాజా ది గ్రేట్.. అలాగే టచ్ చేసి చూడు.. అంటూ రెండు సినిమాలను ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.