Begin typing your search above and press return to search.

పోటీ పోటీగా రెండు బ‌యోపిక్ లు.. ఏది ఆగ‌బోతోంది?

By:  Tupaki Desk   |   21 Jan 2022 9:30 AM GMT
పోటీ పోటీగా రెండు బ‌యోపిక్ లు.. ఏది ఆగ‌బోతోంది?
X
బ‌యోపిక్‌లు, పాన్ ఇండియా రేంజ్ చిత్రాల హ‌వా టాలీవుడ్ లో కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే కొన్ని జీవిత క‌థ‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ లుగా నిల‌వ‌గా మ‌రికొన్ని తెర‌పైకి రాబోతున్నాయి. అందులో ప్ర‌ధానంగా వినిపిస్తున్న పేరు టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు. స్టువ‌ర్టుపురం గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవిత క‌థ ఆధారంగా ఒకేసారి రెండు బ‌యోపిక్ లు తెర‌పైకొచ్చాయి. అందులో ఒక‌టి `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు`, మ‌రొక‌టి `స్టువ‌ర్ట్ పురం దొంగ`. ఈ రెండు చిత్రాల్లో క్రేజీ హీరోలు న‌టిస్తున్నారు.

దీంతో టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు బ‌యోపిక్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` లో మాస్ మహారాజా ర‌వితేజ న‌టిస్తున్నారు. `స్టువ‌ర్టుపురం దొంగ‌` చిత్రంలో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్ న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే బెల్లంకొండ శ్రీ‌నివాస్ న‌టిస్తున్న `స్టువ‌ర్టుపురం దొంగ‌` షూటింగ్ మొద‌లైంది. ప‌లు కీల‌క ఘ‌ట్టాల‌ని హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్ పై చిత్రీక‌రించారు కూడా.

ఈ రెండు చిత్రాల‌పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇటీవ‌ల ఈ రెండు చిత్రాల‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ విడుద‌ల చేశారు కూడా. అయితే ర‌వితేజ న‌టిస్తున్న `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` మూవీకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేయ‌లేదు. ప్రీ లుక్ ని మాత్ర‌మే విడుద‌ల చేశారు. అందులో ర‌వితేజ కాళ్లు మాత్ర‌మే క‌నిపిస్తుండ‌గా `స్టువ‌ర్టుపురం గ‌జ‌దొంగ‌` ఫ‌స్ట్ లుక్ లో బెల్లంకొండ శ్రీ‌నివాస్ భారీగా మీసం , గ‌డ్డంతో క‌నిపించిన విష‌యం తెలిసిందే.

తాజాగా స‌మాచారం ప్ర‌కారం ఈ రెండు చిత్రాల్లో ర‌వితేజ న‌టిస్తున్న `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` ప్రాజెక్ట్ ని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నార‌ట‌. పాపుల‌ర్ గ‌జ‌దొంగ బ‌యోపిక్ కావ‌డంతో దీనికి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ని తీసుకురావాల‌ని మేక‌ర్స్ ఇప్ప‌టికే ఏర్ప‌ట్ల‌ని పూర్తి చేశార‌ట‌. అంతే కాకుండా ఈ మూవీపై ర‌వితేజ్ ప్ర‌త్యేక దృష్టిని పెట్టార‌ని, అందుకే మేక‌ర్స్ ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించడానికి రెడీ అయిపోయార‌ని వార్త‌లు విన‌పిస్తున్నాయి.

ఇక `స్టువ‌ర్టు పురం గ‌జ‌దొంగ‌` టీమ్ కూడా ఏ విష‌యంలోనూ త‌గ్గ‌డం లేదు. అయితే పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని ప్లాన్ చేస్తారా లేదా అన్న‌ది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేప‌థ్యంలో ఈ రెండు చిత్రాల‌పై ఓ సాక్తిక‌ర‌మైన వార్త ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో చ‌క్క‌ర్లు కొడుతోంది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ రెండు బ‌యోపిక్‌ల‌లో ఓ ఫిల్మ్ మేక‌ర్స్ త‌మ చిత్రాన్ని ఆపేయాల‌నే ఆలోచ‌న‌లో వున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అది ఏ హీరో సినిమా అన్న‌ది మాత్రం తెలియాల్సి వుంది.