Begin typing your search above and press return to search.

కొడుకుపై సీరియస్ లుక్కేస్తున్న మాస్ మహారాజ్

By:  Tupaki Desk   |   26 April 2020 4:32 PM GMT
కొడుకుపై సీరియస్ లుక్కేస్తున్న మాస్ మహారాజ్
X
కరోనా లాక్ డౌన్ స‌మ‌యంలో దేశం మొత్తం ఇళ్లలో బంధీ అయిందని చెప్పవచ్చు. దీంతో హీరోలంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయిపోయారు. ఎప్పుడూ బిజీగా ఉండే జీవితం క‌దా వాళ్ళది.. అందుకే దొరికిన టైమ్ ను పూర్తిగా పిల్ల‌ల‌కు ఇచ్చేస్తున్నారు. ప్ర‌తీ స్టార్ హీరో కూడా ఇప్పుడు ఇదే ప‌ని చేస్తున్నాడు. అనుకోకుండా వచ్చిన ఈ హాలిడేస్ ని ఫ్యామిలీ కోసం కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు ఫ్యామిలీతో మిస్ అయిన సమయాన్ని అంతా ఇప్పుడు కవర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. మన మాస్ మహారాజా రవితేజ్‌ కూడా ఈ క్వారంటైన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నారు. నిజానికి రవితేజ తన పర్సనల్ విషయాలు ఎక్కువగా ఎక్కడా షేర్ చేసుకోరు. తన ఫ్యామిలీ విషయాలు కూడా ఎక్కడా బయటపెట్టరు. కానీ ఆయన సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాక తన పిల్లలతో కలిసి దిగిన ఫొటోలను అప్పుడప్పుడు షేర్‌ చేస్తున్నారు.

ఇప్పుడు తాజాగా రవితేజ తన కొడుకుతో కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూస్తే రవితేజ ఎక్కువ సమయం తన కొడుకు మహాధన్ తో స్పెండ్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది. అయితే ఈ ఫొటోలో తండ్రీకొడుకులు ఇద్దరూ మొబైల్స్ చేతిలో పట్టుకొని ఉన్నారు. కొడుకు మహాధన్ మాత్రం మొబైల్ తో బిజీగా ఉండగా.. మాస్ మహారాజ్ మాత్రం తన కొడుకు వైపు చాలా సీరియస్ గా చూస్తున్నాడు. మహాధన్ మొబైల్ లో ఏమి చేస్తున్నాడో అని ఆలోచిస్తున్నాడేమో అన్నట్లు లుక్స్ ఉన్నాయి. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రవితేజ కుమారుడు మహాధన్ 'అమర్ అక్బర్ ఆంటోనీ' 'రాజా ది గ్రేట్' చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. వీటిలో ఒక సినిమా ప్లాప్ అవ్వగా.. మరో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మరోవైపు రవితేజ ప్రస్తుతం 'క్రాక్' సినిమాలో నటిస్తున్నాడు. తన కెరీర్లో 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ ఒక పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. వీరి కాంబోలో ఇంతకముందు వచ్చిన 'డాన్‌ శీను' - 'బలుపు' చిత్రాలు మంచి విజయాలను సొంతం చేసుకోగా.. ఇప్పుడు 'క్రాక్' సినిమాతో హ్యాట్రిక్‌ హిట్ కోసం రెడీ అవుతున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా వేసుకున్నారు.