Begin typing your search above and press return to search.

క్రిష్ రాయబారి మెగా హీరోనే

By:  Tupaki Desk   |   3 Dec 2015 7:58 AM GMT
క్రిష్ రాయబారి మెగా హీరోనే
X
రీసెంట్ గా డైరెక్టర్ క్రిష్ రిజిస్టర్ చేసిన రాయబారి టైటిల్ చాలా ఆసక్తిని కలిగించింది. ఈ టైటిల్ ఎవరికోసం రిజిస్టర్ చేశాడనే ఆసక్తి కూడా నెలకొంది. అక్కినేని వారసుడు అఖిల్ సహా చాలాపేర్లు వినిపించినా.. చివరకు మళ్లీ వరుణ్ తేజ్ దగ్గరే ఈ మూవీ ఆగిందని తెలుస్తోంది. రీసెంట్ గా కంచెతో హిట్ కొట్టిన క్రిష్-వరుణ్ తేజ్ లు రాయబారి కోసం మరోసారి జత కట్టబోతున్నారు.

కంచెలో యుద్ధ సైనికుడిగా కనిపించిన మెగా ప్రిన్స్.. ఈసారి సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనుండడం విశేషం. వరుణ్ తేజ్ ని కొత్తగా చూపించబోతున్నారని తెలుస్తోంది. యాక్షన్ - రొమాన్స్ లతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్న రాయబారి స్క్రిప్ట్ నాగబాబు తనయుడికి సూపర్బ్ గా నచ్చిందట. దీంతో క్రిష్ కి వెంటనే ఓకే చెప్పేశాడంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతున్నాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్. మిగిలిన వర్క్స్ కూడా పూర్తి కాగానే.. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయనున్నారు. క్రిష్ తో చేసేందుకు చాలామంది స్టార్లు, సీనియర్లు సిద్ధంగా ఉన్నా.. ఈ దర్శకుడు మాత్రం మరోసారి తనకు హిట్ అందించిన వరుణ్ తేజ్ కే మొగ్గు చూపాడు.

ఇదిలా ఉంటే.., ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో వరుణ్ తేజ్ చేసిన లోఫర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. త్వరలో ఆడియో ఫంక్షన్ చేసి, రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఇప్పటికే గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో కూడా ఓ మూవీ చేసేందుకు వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.