Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: మరీ పచ్చిగా ఉందే

By:  Tupaki Desk   |   7 Nov 2018 11:52 AM GMT
ఫోటో స్టొరీ: మరీ పచ్చిగా ఉందే
X
అడల్ట్ కామెడీ అని ఓపెన్ గా చెప్పేసి బూతు చూపిస్తే జనాలు పెద్దగా పట్టించుకోరు. తిట్టేవాళ్ళు ఎలాగూ తిడతారుగానీ కనీసం మిగతావాళ్ళు మెచ్చుకుంటారు. కానీ అదే ప్రేమ కథ అని చెప్పి బూతు చూపిస్తే మాత్రం బండబూతులు తిట్టే అవకాశం ఉంది. ఇప్పుడు అదే పరిస్థితి 'రాయలసీమ లవ్ స్టొరీ' అనే సినిమా పోస్టర్ విషయంలో జరుగుతోంది.

'రాయలసీమ లవ్ స్టొరీ' మేకర్స్ ఏం చెబుతున్నారంటే రాయలసీమ అనగానే అందరికీ ఫ్యాక్షన్ గుర్తొస్తోందని కానీ అక్కడ కూడా అందమైన ప్రేమ కథలు ఉంటాయని అంటున్నారు. కానీ వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్ మాత్రం అలాలేదు. ఒక ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ లో ఉండే హై-ఫై బాత్ టబ్ లో నగ్నంగా తన్మయత్వంతో ఒకరినొకరు పెనవేసుకున్న హీరో హీరోయిన్లను చూసి దీన్ని ఎవడైనా లవ్ స్టొరీ అనుకుంటాడా.. లేదా 'మథుర రాత్రులు.. మన్మథ లీలల' బాపతు అనుకుంటాడా?

పోస్టర్ పచ్చి బూతులా.. పరమ రోతలా ఉంది. బరితెగించినట్టుగా ఉంది. ఇలాంటి వాటికి లవ్ స్టొరీ అని పేరుపెట్టడం ఏంటో? 'అర్జున్ రెడ్డి'.. 'RX 100' సినిమాల్లో బోల్డ్ కంటెంట్ ఉన్నా అందులో కంటెంట్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంది. అందుకే ఆ సినిమాలు జనాలకు నచ్చాయి. ఇక ఈ సీమ లవ్ స్టొరీ లో నిజం గా కంటే ఉందా.. లేదా జస్ట్ ఈ బూతుతో నెట్టుకొద్దామని భావిస్తున్నారా?