Begin typing your search above and press return to search.
ఇల్లు అలకగానే సరిపోదు! థమన్ కి #RC 15 ఫ్యాన్స్ హెచ్చరిక!!
By: Tupaki Desk | 12 Sep 2021 7:30 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న 15వ చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కేటగిరీలో నిర్మిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. అయితే సాధారణంగా శంకర్ సినిమాలకు సంగీతం అంటే? ఏ. ఆర్ రెహమాన్.. హారీష్ జయరాజ్ లాంటి దిగ్గజాలు మాత్రమే సంగీతం అందిస్తుంటారు. ఆ ముగ్గురి కాంబినేషన్ లో గతంలో వచ్చిన సక్సెస్ ల నేపథ్యంలోనే ఆ ద్వయానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది కూడా. కానీ అనూహ్యంగా శంకర్ యంగ్ ట్యాలెంట్ థమన్ ని రంగంలోకి దింపి షాకిచ్చారు. నిజానికి ఇది ఊహించనిదే.
థమన్ కన్నా ఎంతో మంది సీనియర్లు పనితనం ఉన్నవాళ్లు అందుబాటులో ఉన్నా శంకర్ థమన్ ని ఏరికోరి మరీ ఎంపిక చేసారు. థమన్ ని మాత్రమే తీసుకోవాలని శంకర్ చాలా మెండి పట్టు పట్టారని కథనాలొచ్చాయి. ఆ రకంగా శంకర్ తో కలిసి పనిచేసే అరుదైన అవకాశం థమన్ దక్కించుకున్నారు. అయితే ఈ ఛాన్స్ పై థమన్ ఏమన్నారంటే? తొలుత శంకర్ సర్ తో దిల్ రాజు సర్ ప్రాజెక్ట్ ప్రకటించగానే నేను రాజుగారిని అభినందించాను. ఏ. ఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజర్ అవుతారని అనుకున్నాను. కానీ దిల్ రాజు గారు వచ్చి నన్ను సంగీత దర్శకుడిగా తీసుకోవడంలో శంకర్ చాలా పట్టుదలగా ఉన్నట్లు చెప్పారు. ఆ సమయంలో వకీల్ సాబ్ రీరికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నాను...అప్పుడే చెన్నై వెళ్లి శంకర్ సర్ ని కలు అని దిల్ రాజు గారు చెప్పారు. నిజంగా చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను.
ఇది గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు తమన్ తెలిపారు. శంకర్ సర్ తో పనిచేస్తానని కలలో కూడా అనుకోలేదు. కొంత మంది దర్శకులు కొంత మందితోనే పనిచేస్తారు. అందులో నేను ఉంటానని ఏ రోజు ఊహించలేదు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. శంకర్ గారు నెల రోజుల్లోనే ట్యూన్స్ ఇమ్మన్నారు. మార్చి..ఏప్రిల్..జులై నెలల్లో ఒక్కో పాటను కంపోజ్ చేసాను. అంతా హ్యాపీ అని థమన్ తెలిపాడు. ఇక శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాయ్స్ సినిమాలో థమన్ నటించిన సంగతి తెలిసిందే. అందులో డ్రమ్స్ వాయించడంలో థమన్ స్పెషలిస్ట్ గా కనిపిస్తారు. ఆసక్తికరంగా థమన్ ఎంపిక వెనక వేరే కారణాల్ని విశ్లేషిస్తే.. పరిశ్రమలో అత్యంత వేగంగా బాణీలు అందించే యువ సంగీత దర్శకుడిగా థమన్ కి రికార్డ్ ఉంది. కానీ ఏ.ఆర్.రెహమాన్ అలా ఇవ్వలేరు. చాలా సమయం తీసుకుంటారు. బహుశా అందుకే థమన్ ని ఎంపిక చేసుకుని ఉండొచ్చు. ఇక తమతో ప్రాజెక్ట్ ని డెడ్ లైన్ ప్రకారం పూర్తి చేయాలని శంకర్ కి దిల్ రాజు కండీషన్ పెట్టారని కూడా గుసగుసలు వినిపించాయి. అంటే డెడ్ లైన్ ప్రకారం మ్యూజిక్ డైరెక్టర్ ఎవరున్నారు? అంటే ఎస్.ఎస్.థమన్ బెస్ట్ అనడంలో సందేహమేం లేదు. అల వైకుంఠపురములో ట్యూన్స్ తో మ్యాజిక్ చేసిన థమన్ రీరికార్డింగ్ స్పెషలిస్టుగా పాపులరయ్యారు కాబట్టి శంకర్ స్టైల్లో సంగీతం అందిస్తారనే అంతా ఆశిస్తున్నారు. రెహమాన్ కి ఆల్టర్నేట్ తన మ్యూజిక్ మాత్రమేనని నిరూపించాల్సి ఉంటుంది. ఇల్లు అలకగానే సరిపోదు! అని రెహమాన్ అభిమానులు హెచ్చరిస్తున్నారు.