Begin typing your search above and press return to search.
#RC 15 శంకర్ కి ఏ ఫార్మాట్ లో పారితోషికం?
By: Tupaki Desk | 8 July 2021 7:30 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించనున్న 15వ చిత్రానికి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇలా క్రేజీ కాంబో తొలిసారి చేతులు కలిపి తెలుగు అభిమానుల్లో జోష్ నింపింది.
ఇంత వరకూ బాగానే ఉంది. మరి శంకర్ ప్రొడక్షన్ రేంజ్ కి బడ్జెట్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. శంకర్ సినిమా అంటే వందల కోట్ల రూపాయలు మంచి నీళ్లలా ఖర్చు చేయాలి. షూటింగ్ లోకేషన్స్ స్థానికమే అయినా.. ఆ లోకేషన్స్ క్యాప్చర్ చేసేందుకు విజువల్ గ్రాఫిక్స్ కోసం శంకర్ వాడే టెక్నాలజీ చాలా అడ్వాన్స్ గా ఉంటుంది.
ఆ రకంగా టెక్కికల్ గా బడ్జెట్ ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఇక పాటలు.. విదేశీ షూటింగ్ లు అంటే తడిసి మోపుడవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాటల కోసం ప్రత్యేకంగ ఖరీదైన సెట్లు నిర్మించాలి..నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కావడానికి వీల్లేదు. అడిగింది క్షణాల్లో తెచ్చి పెట్టాలి. లేదంటే సీన్ వేరేలా ఉంటుంది. ఇలాంటి గత అనుభవాలు ఎన్నో శంకర్ సినిమాల చిత్రీకరణ సమయాల్లో కనిపిస్తాయి. ఇదంతా పక్కనబెడితే ఈ సినిమాకి శంకర్ అందుకునే పారితోషికం ఎంత అంటే? అదీ చుక్కలోనే కనిపిస్తుందని ఇన్ సైడ్ టాక్.. ఈ సినిమాకు 60 కోట్లు వరకూ శంకర్ డిమాండ్ చేస్తున్నారట.
ఇందులో నిజం ఎంత అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆ వార్త సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. శంకర్ రేంజ్ ని బట్టి అంతకు తగ్గేదే లేదు.. ఎందుకంటే శంకర్ సినిమా హిట్ టాక్ వచ్చిదంటే బాక్సాఫీస్ వద్ద కనక వర్షమే.. నిర్మాత బస్తాల్లోకి ఎత్తుకోవాలి. అందుకే శంకర్ పారితోషికం తీసుకున్నా లాభాల్లో వాటా తీసుకుంటారు. మరి దిల్ రాజు తో శంకర్ కమిట్ మెంట్ ఎలాంటిది అన్నదానిపై డీటెయిల్స్ మరింత లోతుగా తెలియాల్సి ఉంది.