Begin typing your search above and press return to search.

శంక‌ర్ వెంట‌ ది గ్రేట్ సైంటిస్ట్ టెక్నాల‌జీ మిసైల్ లేని లోటు!

By:  Tupaki Desk   |   26 Aug 2021 4:30 AM GMT
శంక‌ర్ వెంట‌ ది గ్రేట్ సైంటిస్ట్ టెక్నాల‌జీ మిసైల్ లేని లోటు!
X
ర‌చ‌యిత‌లు వేరు.. ద‌ర్శ‌కులు వేరు. ర‌చ‌యిత రాసిన స‌న్నివేశాన్ని విజువ‌ల్ గా ఊహించి తెర రూపం ఇవ్వ‌డం ద‌ర్శ‌కుడి ప‌ని. అయితే ర‌చ‌యిత నుంచి సాధ్య‌మైనంత వ‌ర‌కూ దృశ్యాల‌కు సంబంధించిన‌ ఇన్ పుట్స్ ఉంటాయి. దాంతో ద‌ర్శ‌కుల ప‌ని చాలా సులువు అయిపోతుంది. ఇది ర‌చ‌యిత‌ల‌తో ద‌ర్శ‌కుని డిస్క‌ష‌న్స్ ద్వారా సాధ్య‌ప‌డేది. అయితే ఇటీవ‌లి కాలంలో స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ రైటింగ్ విభాగం కాస్త వీక్ గా క‌నిపిస్తోందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

దానికి కార‌ణం లేక‌పోలేదు.. శంక‌ర్ కొలువులో ఇంత‌కుముందు మాస్ట‌ర్ మైండ్ అన‌ద‌గ్గ గొప్ప ర‌చ‌యిత ఉండేవారు. ఆయ‌న పేరు సుజాత రంగ‌రాజ‌న్. త‌మిళ‌నాట ప్ర‌సిద్ధ న‌వ‌లార‌చ‌యిత‌. ప్రొఫెస‌ర్.. ఎన్నో సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశాల్ని ఆయ‌న రాసారు. టెక్నాల‌జీ గురువుగా యువ‌త‌రం సందేహాల‌కు మ్యాగ‌జైన్ రైట‌ర్ గా స‌మాధానాలిచ్చేవారు. అలాంటి గ్రేట్ రైట‌ర్ శంక‌ర్ కొలువులో లేక‌పోవ‌డం నిజంగా తీర‌ని లోటు. ది గ్రేట్ సుజాత రంగ‌రాజ‌న్ (72) జెంటిల్ మేన్ మొద‌లు రోబో చిత్రం వ‌ర‌కూ శంక‌ర్ కి క‌థ‌లు రాసి స్క్రిప్టు ప‌నులు చేశారు. 100 న‌వ‌ల‌లు 250 పైగా చిట్టి క‌థ‌ల్ని రాసిన అనుభ‌వ‌జ్ఞుడు. పిక్ష‌న్ సైన్స్ పిక్ష‌న్ నాన్ ఫిక్ష‌న్ ఇలా అన్ని విభాగాల్లోనూ ఆయ‌న గొప్ప ర‌చ‌న‌లు చేశారు.

కానీ ఈరోజు ఆయ‌న లేరు. 27 ఫిబ్ర‌వ‌రి 2008లో ఆయ‌న మ‌ర‌ణించారు. రోబో 2008లో మొద‌లై 2010లో రిలీజైంది. అనంత‌ర కాలంలో సుజాత రంగ‌రాజ‌న్ లేని లోటును పూడ్చేందుకు శంక‌ర్ చాలానే శ్ర‌మించాల్సి వ‌చ్చింది. ఇక రోబో సీక్వెల్ ప్రీక్వెల్ కాని ఒక స‌రికొత్త క‌థ‌తో 2.0 తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి త‌మిళ ఫిలిం క్రిటిక్ ర‌చ‌యిత జేయ మోహ‌న్ తో క‌లిసి శంక‌ర్ స్క్రిప్ట్ వ‌ర్క్ చేశారు.

ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ తో శంక‌ర్ ఆర్.సి15 తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే శంక‌ర్ ప‌నులు మొద‌లు పెట్టాడు. హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోస్ లో చ‌ర‌ణ్ పై ఫోటోషూట్ స‌హా లాంచింగ్ కి రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఆర్.సి15 క‌థాంశంపైనా ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. RC15 ఒక రాజకీయ డ్రామా.. అవినీతి రాజ‌కీయాల‌ను తెర‌పై ఆవిష్క‌రించ‌నున్నారు. అయితే ఈ సినిమా స్క్రిప్టు వ‌ర్క్ లో ఈసారి ఎవ‌రు పాలుపంచుకుంటున్నారు? సుజాత్ రంగ‌రాజ‌న్ లేరు... జ‌ర్న‌లిస్ట్ జేయ మోహ‌న్ ఈ చిత్రానికి ప‌ని చేయ‌డం లేదు. అందుకే ఇప్పుడు ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ కార్తీక్ సుబ్బ‌రాజ‌న్ తో క‌లిసి శంక‌ర్ స్క్రిప్టును వంద‌శాతం ఫైన‌లైజ్ చేసేందుకు వ‌ర్క్ చేస్తున్నార‌ని తెలిసింది.

గతంలో జిగర్తాండ- పెట్టా - జగమే తంతిరం చిత్రాలకు దర్శకత్వం వహించిన కార్తీక్ సుబ్బరాజ్ ఈ ప్రాజెక్ట్ లో భాగమ‌వుతున్నారు. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సన్నిహిత వర్గాల వివ‌రాల ప్ర‌కారం.. కార్తీక్ ఈ సినిమా కథ అభివృద్ధిలో పాలుపంచుకున్నార‌ని తెలిసింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు శంకర్ తో పనిచేయడం ఇదే మొదటిసారి. అలాగే ఆ ఇద్ద‌రితో ర‌చ‌యిత‌ల బృందం స‌న్నివేశాల రూప‌క‌ల్ప‌న కోసం ప‌ని చేస్తోంది.

అంత‌టి ప‌వ‌ర్ ఫుల్ రైట‌ర్ ఇక రారు

శంక‌ర్ కొలువులో సుజాత రంగ‌రాజ‌న్ అంత ప్ర‌భావ‌వంత‌మైన మ‌రో ర‌చ‌యిత ఇప్ప‌ట్లో లేనే లేరు. ఆయ‌న అనుభ‌వం కానీ ఆయ‌న మేధోత‌నం కానీ త‌మిళ‌నాట పుట్టుకురావ‌డం కూడా అంత సులువేమీ కాదు. అంతటి అసాధార‌ణ ప్ర‌జ్ఞావంతుడిగా అత‌డు పాపుల‌ర‌య్యారు. సైన్స్ అండ్ టెక్నాల‌జీ ప‌రిజ్ఞానాన్ని సామాన్యుల‌కు ఎలా అనువ‌ర్తించాలి? అన్నది చెప్ప‌గ‌లిగే క్రియేటివ్ జీనియ‌స్ ఆయ‌న. అందుకే సుజాత రంగ‌రాజ‌న్ ర‌చ‌యిత‌గా ఉన్న ప్ర‌తి సినిమాలో స‌న్నివేశాలు పూర్తిగా మాస్ కి సామాన్యుల‌కు క‌నెక్టెడ్ గా అల‌రించాయి. రోబోలాంటి హై టెక్నిక‌ల్ స్టాండార్డ్ మూవీలోనూ సామాన్య ఆడియెన్ కి అర్థ‌మ‌య్యేంత క్లారిటీగా శంక‌ర్ చూపించారంటే దానివెన‌క ప్ర‌ధాన బ‌లం సుజాత రంగ‌రాజ‌న్.