Begin typing your search above and press return to search.

RC 15..ఆ విష‌యంలో త‌ప్పెవ‌రిది?

By:  Tupaki Desk   |   8 Sep 2022 2:46 PM GMT
RC 15..ఆ విష‌యంలో త‌ప్పెవ‌రిది?
X
భారీ ప్రాజెక్ట్ లు నిత్యం లీకుల బెడ‌ద‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో వ‌కీల్ సాబ్‌, పుష్ప‌, స‌ర్కారు వారి పాట‌, తాజాగా RC 15.. ఇలా ప్ర‌తీ సినిమాని లీకులు వెంటాడుతూనే వున్నాయి. అయితే మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తున్న RC 15 విష‌యంలో మాత్రం ప్ర‌తీదీ లీక్ అవుతూ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీని, ద‌ర్శ‌కుడు శంక‌ర్ ని క‌ల‌వ‌ర‌పెడుతూనే వున్నాయి. శంక‌ర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.

కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలో ఎస్‌.జె. సూర్య‌, శ్రీ‌కాంత్‌, సునీల్, స‌ముద్ర‌ఖ‌ని, అంజ‌లి, జ‌య‌రామ్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే కీల‌క టెక్నీషియ‌న్ లు ఈగో క్లాషెస్ కార‌ణంగా ఈ ప్రాజెక్ట్ ని వీడిపోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంటే లీకులు మాత్రం ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభం నుంచి వెంటాడుతూనే వున్నాయి.

ఈ మూవీ కీల‌క షెడ్యూల్స్ ని రాజ‌మండ్రి, అమృత్ స‌ర్ ల‌లో పూర్తి చేశారు. రాజ‌మండ్రిలో చ‌ర‌ణ్ పై రూపొందించిన ప‌లు కీల‌క ఘ‌ట్టాలు, చ‌ర‌ణ్ సైకిల్ పై వెళుతున్న స‌న్నివేశాల‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట లీకై వైర‌ల్ గా మారిన విష‌యం తెలిసిందే.

ఆ త‌రువాత కూడా ప‌లు ఫొటోలు లీక్ కావ‌డంతో చిత్ర బృందం లీకుల‌పై లీగ‌ల్ గా యాక్ష‌న్ తీసుకుంటామ‌ని, లీకుల‌కు పాల్ప‌డే వారు చ‌ట్ట‌ప‌రంగా శిక్షింప‌బ‌డ‌తార‌ని చిత్ర బృందం, ద‌ర్శ‌కుడు శంక‌ర్ సీరియ‌స్ గా మీడియా ప్ర‌క‌ట‌న కూడా చేశారు.

అయినా స‌రే ఈ మూవీకి సంబంధించిన లీకులు జ‌రుగుతూనే వున్నాయి. తాజాగా ఓ సాంగ్ షూట్ కోసం ఏర్పాటు చేసిన సెట్ తో పాటు సాంగ్ ఆడియో కూడా లీక్ అవుడంతో ఫ్యాన్స్ మేక‌ర్స్ పై మండిప‌డుతున్నారు. ఇప్ప‌టికైనా లీకుల‌పై జాగ్ర‌త్త వ‌హించండ‌ని దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్ కంప‌నీకి సూచిస్తూ నెట్టింట ట్వీట్ లు చేస్తున్నారు. దీంతో RC 15 ట్రెండింగ్ అవుతోంది. ఇదిలా వుంటే లీకులు విష‌యంలో త‌ప్పెవ‌రిది అనే చ‌ర్చ జ‌రుగుతోంది. శంక‌ర్ దా? లేక స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు దా? అని నెటిజ‌న్ లు కామెంట్ లు చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.