Begin typing your search above and press return to search.
2024లోనే RC 16 రిలీజ్..2023 అంతా షూటింగ్!
By: Tupaki Desk | 4 Nov 2022 3:30 AM GMT# ఆర్ సీ 15 ఆన్ సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే 50 శాతానికిపై గా షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. బ్యాలెన్స్ షూట్ కూడా పూర్తిచేసి వచ్చే ఏడాది రిలీజ్ చేయాలన్నది ప్లాన్. మరి ఇది సాధ్యమేనా? ప్రస్తుతం శంకర్ బిజీ షెడ్యూల్ నడుమ షూటింగ్ అనుకున్న సమయంలో పూర్తిచేయగలరా? అంటే కష్టమేనే తెలుస్తోంది.
మరోవైపు శంకర్ ఇండియన్-2ని కూడా పూర్తిచేయాల్సి ఉంది. ముందు కమిట్ అయిన ప్రాజెక్ట్ కావడంతో `ఇండియన్-2`నే ముందుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా ఆర్సీ15ని పూర్తిగా పక్కనబెట్టకుండా షూట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాపై శంకర్ పూర్తి స్థాయిలో దృష్టి సారించేంది ఎప్పుడు? అంటే వచ్చే ఏడాదా మిడ్ నుంచే సాధ్యమవుతుందని కోలీవుడ్ వర్గాల సమాచారం.
అదే నిజమైతే చరణ్ సినిమా వచ్చేడాది రిలీజ్ దాదాపు లేనట్లు గానే భావించాలి. ఆ ఏడాదంతా షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం కేటాయించాలి. శంకర్ సినిమా టెక్నికల్ పనులంటే? ఎంత నెమ్మదిగా సాగుతాయో చెప్పాల్సిన పనిలేదు. పిన్ టూ పిన్ జాగ్రత్త వహిస్తారు. బెస్ట్ టెక్నీషియన్లతో ఫినిషింగ్ టచ్ ఉంటుంది. ఇవన్నీ పూర్తి అవ్వడానికి ఎలా లేదన్నా ఆరు నెలులు సమయం పడుతుంది.
అంటే చరణ్ సినిమా 2024 మిడ్ లోనే రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉందని ఓ గెస్సింగ్ వినిపిస్తుంది. అదీ `ఇండియన్-2` ఎ లాంటి ఆటకం లేకుండా అన్ని పనులు వేసకున్న ప్రణాళిక బద్దంగా జరిగితే ఆర్సీ15 విషయంలో కొంత సమయం కలిసొస్తుంది. లేదంటే అంతకు మించి ఆలస్యమైనా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఆ లెక్కన చరణ్ సినిమా రిలీజ్ గ్యాప్ ఎక్కువగానే కనిపిస్తుంది. ఈ ఏడాది మార్చిలో `ఆర్ ఆర్ ఆర్` తో చరణ్ ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం చరణ్ 2023 రిలీజ్ టార్గెట్ గా శంకర్ చిత్రాన్ని పట్టాలెక్కించి వేగవంతం చేసాడు. కానీ జాప్యం తప్పేలా కనిపించలేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.