Begin typing your search above and press return to search.
# RC 15 సమీకరణాలు మారుతున్నాయా?
By: Tupaki Desk | 6 July 2022 11:30 PM GMTరామ్ చరణ్ -శంకర్-దిల్ రాజ్ త్రయంలో #ఆర్ సీ 15 భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు..మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయింది. రాజమండ్రి..వైజాగ్..పుణే లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. శంకర్ సినిమా షూటింగ్ అంటే ప్రతీ షెడ్యూల్ ఎంతో ప్రత్యేకమైనది. ఆర్ సీ 15 లోనూ అదే సన్నివేశం కనిపిస్తుంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా శంకర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే రాజమండ్రి షెడ్యూల్ కి 30 కోట్ల ఖర్చు చేసినట్లు ప్రచారం సాగుతోంది. అలాగే క్లైమాక్స్ లో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ కి దాదాపు 20 కోట్లు వెచ్చించినట్లు వెలుగులోకి వచ్చింది. ఇక పుణే షెడ్యూ ల్ కి భారీగానే ఖర్చు జరగినట్లు తెలుస్తోంది. మొత్తగా ఇప్పటివరకూ సినిమాకి అయిన ఖర్చు 100 కోట్లు దాటిందని ఓ అంచనాగా వినిపిస్తుంది.
మరి షూటింగ్ ఎంత వరకూ పూర్తయిందంటే? 45 శాతమే చిత్రీకరణ పూర్తిచేసినట్లు తెలుస్తోంది. బ్యాలెన్స్ 55 శాతం పూర్తవ్వడానికి ఇంకా చాలా సమయం పడుతుందని సమాచారం. సినిమా సెట్స్ కి వెళ్లిన ఆరంభంలో చకచకా షూటింగ్ జరిగిన ఆ తర్వాత ఒక్కసారిగా వేగం తగ్గిన మాట వాస్తవం. డిసెంబర్ లోపు షూట్ పూర్తిచేయాల్సిన సినిమా వచ్చే ఏడాది మిడ్ వరకూ కూడా షూట్ దశలోనే ఉండేలా కనిపిస్తుంది. మరి ఈ పరిస్థితులు ఆర్ సీ 15 సమీకరణాల్లో మార్పులు తీసుకొస్తున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది.
వాస్తవానికి ఈ చిత్రానికి అనుకున్న బడ్జెట్ 200 కోట్లు. మరి ఇప్పుడా బడ్జెట్ క్రాస్ అవుతుందా? అంటే అవుననే గుసగుస వినిపిస్తుంది. యాభై శాతం షూట్ పూర్తికాకుండానే 100 కోట్లు పైనే వెచ్చించారంటే? మిగిలిన భాగాన్ని పూర్తిచేయడానికి ఎలా 100 కోట్లు చాలవు అన్న వార్త అందర్ని కుదిపేస్తోంది. శంకర్ గత సినిమాల నిర్మాణాల్ని అంచనా వేసుకునే ఆర్ సీ 15 బడ్జెట్ పై సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఈ కారణంగానే శంకర్ సినిమాలు డిలే అవుతాయన్నది వాస్తవం.
ఆయన తెరకెక్కిస్తోన్న `ఇండియన్ -2` కి కూడా ఆ మధ్య అందుకే బ్రేకులు పడ్డాయి. మరి చరణ్ సినిమా విషయంలో తాజా సమీకరణాలే నిజమే అయితే వాటిని రాజుగారు ఎలా అధిగమించి ముందుకెళ్తారు? అన్నది ఆసక్తికరం. అయితే శంకర్ తో ఇండియాన్ -2 సినిమా నిర్మాణానికే రాజుగారు పూనుకుని డ్రాప్ అయ్యారు కాబట్టి ఈ సినిమా విషయంలో ఇలాంటి వాటిని సులభంగానే అధిగమిస్తారు అన్న ధీమా కనిపిస్తుంది.
శంకర్ గురించి పూర్తిగా తెలుసుకునే రాజుగతారు రింగులోకి దిగారని చెప్పొచ్చు. శంకర్ తో సినిమా చేయడమే డ్రీమ్ గా రాజుగారి వైఖరి తొలి రోజుల్లోనే కనిపించింది. అదే నిజమైతే సమీకరణాలు మారినా రాజుగారికి అదేం పెద్ద లెక్క కాదు.