Begin typing your search above and press return to search.
చెర్రీ డైరీస్: రాజమౌళితో అలా శంకర్ తో ఇలా
By: Tupaki Desk | 2 Dec 2021 7:08 AM GMTఒకేసారి ఇద్దరు ఇండియా లెవల్ టాప్ డైరెక్టర్లతో పని చేస్తే ఇదే కన్ఫ్యూజన్. స్టార్ హీరో రామ్ చరణ్ కి ఇలాంటి కన్ఫ్యూజన్ ఎదురవుతోంది. ఓవైపు ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ప్రమోషన్స్ లో పాల్గొంటూనే శంకర్ తో ఆర్.సి 15 గురించి అధికంగానే మాట్లాడేస్తున్నారని అర్థమవుతోంది.
నిజానికి ఆర్.సి 15 గురించి దాచాలన్నా దాచలేకపోతున్నాడు. ప్రతిదీ ఓపెనైపోతున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రాజకీయ డ్రామా అయిన RC15 చిత్రీకరణలో చరణ్ బిజీగా ఉన్నారు. అలాగే RRR - ఆచార్య విడుదల కోసం కూడా ఎదురుచూస్తున్నాడు. ఇవి వరుసగా జనవరి 7 .. ఫిబ్రవరి 4 న విడుదల కానున్నాయి. RRR గురించి చరణ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తన పాత్ర మూడు విభిన్న షేడ్స్ కలిగి ఉంటుందని అవన్నీ వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి అనితెలిపారు. రాజమౌళితో కలిసి పనిచేయడం ఒక కల లాంటిది. ఆయనతో కలిసి పనిచేసేటప్పుడు నేను చాలా నేర్చుకుంటాను నటుడిగా అభివృద్ధి చెందుతాను అని చరణ్ అన్నారు.
RC15 గురించి ప్రస్థావిస్తూ.. ఇది పొలిటికల్ డ్రామా అని శంకర్ తో కలిసి పనిచేసే ప్రతి క్షణాన్ని తాను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నానని చరణ్ చెప్పాడు. ఫిబ్రవరి 2023లో ఈ చిత్రం థియేట్రికల్ గా విడుదల కాబోతోందని చరణ్ ధృవీకరించారు. రాజమౌళితో అలా శంకర్ తో ఇలా అనిపించేలా ఒకరితో ఎక్కువ నేర్చుకునేందుకు ఆస్కారం ఉందన్న చరణ్ మరొకరితో సెట్స్ లో ఎంతో వినోదాత్మకంగా ఉందని అన్నారు.
నాన్నగారి (చిరంజీవి)తో కలిసి పనిచేయడం అనే కల ఆచార్యతో నిజమైంది. మేకప్ వేసుకుని కారవాన్ లోంచి అడుగు పెట్టాక మారిన మనిషిగా అవుతాను. నా పాత్రకు 40 నిమిషాల స్క్రీన్ టైమ్ ఉంటుంది. ఇది సెకండాఫ్ మొత్తం ఉంటుంది అని చరణ్ తెలిపారు. మీడియాతో చాటింగ్ లో చరణ్ ఇప్పటి నుండి ఈ పదేళ్లలో సిగ్గుతో తలదించుకునే చిత్రాలను చేయనని అన్నారు. నటుడిగా నన్ను సవాలు చేసుకోవాలనుకుంటున్నాను. నేను తరువాత షేమ్ అనిపించే సినిమాలు .. పాత్రలు చేయను అని తన ఆలోచనను తెలిపారు.