Begin typing your search above and press return to search.
RC15 కన్ఫూజన్... రేపటి నుండి ఉందా? లేదా?
By: Tupaki Desk | 7 Sep 2022 4:40 PM GMTరామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ విషయంలో సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం తో మెగా ఫ్యాన్స్ తో పాటు అంతా కూడా కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇండియన్ 2 సినిమా పునః ప్రారంభించిన సమయంలో రామ్ చరణ్ సినిమాని శంకర్ మూడు నాలుగు నెలల పాటు పక్కకి ఉంచే యోచనలో ఉన్నాడంటూ పుకార్లు షికార్లు చేశాయి.
ఆ పుకార్లను దర్శకుడు శంకర్ కొట్టిపారేస్తూ తాను రెండు సినిమాలను సమాంతరంగా చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్ లో రామ్ చరణ్ సినిమా షూటింగ్ ను ప్రారంభించబోతున్నట్లుగా స్వయంగా శంకర్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఆ షెడ్యూల్ కి సంబంధించిన విషయాలను కూడా దర్శకుడు శంకర్ స్పష్టంగా చెప్పాడు.
కనుక మెగా ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అయ్యారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఆర్ సీ 15 షూటింగ్ అన్నారు కదా ఎప్పటి నుండి అంటూ గత రెండు మూడు రోజులుగా మెగా ఫ్యాన్స్ లో చర్చ మొదలు అయ్యింది. ఈ సమయంలో రేపటి (సెప్టెంబర్ 8) నుండి షూటింగ్ ని దర్శకుడు పునః ప్రారంభించబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలయ్యింది.
కానీ ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం శంకర్ ఇండియన్ 2 సినిమా షెడ్యూల్ అనుకున్న సమయంకు పూర్తి అయ్యే పరిస్థితి లేదట. దాంతో కాస్త ఆలస్యంగా ఆర్ సీ 15 సినిమా షూటింగ్ లో ఆయన జాయిన్ అవుతాడు అంటున్నారు. కమల్ మరియు కాజల్ ల డేట్ల విషయంలో కాస్త గందరగోళం ఉండటం వల్ల అనుకున్న షెడ్యూల్ ను మరో వారం అదనంగా పెంచారని సమాచారం.
ఆ కారణంగానే ఆర్ సీ 15 సినిమా షూటింగ్ లో రేపటి నుండి శంకర్ పాల్గొనాల్సి ఉన్నా ఆయన హైదరాబాద్ కి రావడం లేదని తెలుస్తోంది. ఆయన రాకపోవడంతో దిల్ రాజు షూటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు ఏమీ చేయలేదని ఒక వర్గం వారు అంటున్నారు. మొత్తానికి అసలు రేపు షూటింగ్ ఉందా ? లేదా అనే విషయం లో క్లారిటీ లేక అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. దిల్ రాజు కాంపౌండ్ నుండి ఈ విషయమై స్పష్టమైన క్లారిటీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.