Begin typing your search above and press return to search.

RC15 : అక్కడ అప్పుడే ముగించేశారట

By:  Tupaki Desk   |   30 Nov 2022 9:46 AM GMT
RC15 : అక్కడ అప్పుడే ముగించేశారట
X
రామ్‌ చరణ్.. శంకర్ ల కాంబోలో రూపొందుతున్న సినిమా లోని అత్యంత కీలకమైన పాటను న్యూజిలాండ్‌ లోని అత్యంత అరుదైన లొకేషన్స్ లో చిత్రీకరించేందుకు వెళ్లిన విషయం తెల్సిందే. షూటింగ్ ప్రారంభకు ముందు పాట యొక్క బడ్జెట్‌ గురించి ప్రధానంగా చర్చ జరిగింది. మీడియం రేంజ్ హీరోతో రెండు సినిమాలు చేసేంతగా ఆ పాటకే దర్శకుడు శంకర్‌ ఖర్చు చేస్తున్నాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

న్యూజిలాండ్ నుండి చిత్ర యూనిట్ సభ్యులు పలు ఫొటోలు మరియు వీడియోలను షేర్ చేశారు. అక్కడ పాట విషయంలో ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తి రేకెత్తించారు. ఆ పాట గురించి మీడియాలో హడావుడి జరుగుతున్న సమయంలోనే న్యూజిలాండ్ షెడ్యూల్‌ పూర్తి అయ్యింది అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది.

న్యూజిలాండ్‌ నుండి అతి త్వరలోనే చిత్ర యూనిట్‌ సభ్యులు ఇండియా లో ల్యాండ్‌ అవ్వబోతున్నారు.

రామ్‌ చరణ్ కి జోడీగా కియారా అద్వానీ మరియు అంజలి లు నటిస్తున్న ఈ సినిమా కు సంబంధించిన కీలక సన్నివేశాల షెడ్యూల్‌ ను హైదరాబాద్‌ లో డిసెంబర్‌ రెండవ వారం లేదా మూడవ వారంలో ప్రారంభించే అవకాశం ఉంది అంటూ సమాచారం అందుతోంది.

శంకర్ దర్శకత్వంలో సినిమా అంటే వందల కోట్ల బడ్జెట్‌ అనే విషయం తెల్సిందే. ఇంత భారీ బడ్జెట్‌ తో దిల్‌ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దిల్‌ రాజు ప్రొడక్షన్ హౌస్‌ నుండి రాబోతున్న అత్యంత ఖరీదైన సినిమా ఇదే అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మొన్నటి వరకు ఈ సినిమాను సంక్రాంతికి అన్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.