Begin typing your search above and press return to search.
కళ్లు భైర్లు కమ్మేలా RC15 నాన్-థియేట్రికల్ రైట్స్
By: Tupaki Desk | 17 Jan 2022 4:45 AM GMT2022-23 మోస్ట్ అవైటెడ్ మూవీగా RC15 పేరు వినిపిస్తోంది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆర్.ఆర్.ఆర్ తర్వాత మళ్లీ అంతే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందన్న ప్రచారం సాగుతోంది. RC15 అనేది టెంపరరీ టైటిల్. కియరా అద్వాణీ ఇందులో కథానాయికగా నటిస్తోంది.
ఇక ఈ మూవీ కొత్త షెడ్యూల్ పై శంకర్ వర్క్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుండగా.. నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్ ముగిసిందని కూడా తాజాగా గుసగులు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గాసిప్ ప్రకారం.. ZEE ఛానెల్ భారీ బడ్జెట్ చిత్రం నాన్-థియేట్రికల్ హక్కులను రూ. 200 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిందని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ భాగస్వామిగా ZEE5 లాక్ అయ్యిందని గుసగుస వినిపిస్తోంది.
ఇక ఈ మూవీని నిర్మిస్తున్న నిర్మాత దిల్ రాజు వద్దనే అన్ని భాషల థియేట్రికల్ రైట్స్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు సహా హిందీ సౌత్ రైట్స్ అన్నిటినీ దిల్ రాజు తనవద్ద నే లాక్ చేశారని సమాచారం. ఈ మూవీ లాంచింగ్ డే పోస్టర్లలో దర్శకనిర్మాతలు కూడా కనిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో సునీల్- అంజలి- శ్రీకాంత్- నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించేందుకు ఎంపికయ్యారు. 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంగీత సంచలనం థమన్ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఈ నెలాఖరులో ప్రారంభం కానుందని సమచారం.
మూవీ ఆద్యంతం మెరుపులే!
ఆర్.సి 15 ఆద్యంతం శంకర్ మార్క్ మెరుపులకు కొదవేమీ ఉండదని తెలుస్తోంది. ఎంపిక చేసుకున్న కథాంశం వెయిట్ కూడా అంతే ఇదిగా ఉంది. ఓ భారీ సోషియో పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజునిర్మిస్తున్నారు. దాదాపు 300 కోట్ల వరకూ బడ్జెట్ వెచ్చిస్తారని టాక్ వినిపిస్తోంది. శంకర్ సినిమా అంటే కచ్చితంగా బడ్జెట్ విషయంలో రాజీ పడటానికి వీలుండదు. అవుట్ పుట్ విషయంలో క్వాలిటీ అదే విధంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే.