Begin typing your search above and press return to search.
RC15 లోని ఆ పాట మెగా ఫ్యాన్స్ కి కన్నుల పండుగ
By: Tupaki Desk | 10 May 2022 5:30 PM GMTరామ్ చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం వైజాగ్ లో సినిమా షూటింగ్ జరుగుతోంది. రెండు పాత్రల్లో రామ్ చరణ్ కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే దాదాపుగా క్లారిటీ వచ్చింది. అధికారికంగా ఆవిషయమై స్పష్టత రావాల్సి ఉంది. రామ్ చరణ్ ను రెండు విభిన్నమైన పాత్రల్లో శంకర్ చూపించబోతున్న తీరు ఎలా ఉంటుందా అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
శంకర్ సినిమా అంటే భారీ బడ్జెట్ తో పాటలు గుర్తుకు వస్తాయి. ఆయన పాటల కోసం వేసే సెట్స్ మరియు చేసే ఖర్చుతో మీడియం రేంజ్ సినిమా ను తీయవచ్చు అంటారు. ఈ సినిమాకు కూడా ఆ విషయం లో తగ్గడం లేదట. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత అవ్వడం వల్ల కాస్త కాస్ట్ ను దిల్ రాజు కట్ చేసే విధంగా వ్యవహరిస్తాడనే ప్రచారం జరిగింది. కాని అలాంటిది ఏమీ లేదు.. శంకర్ పూర్తి స్వేచ్చగా తన స్టైల్ లో సినిమాను చేస్తున్నాడట.
చిత్ర యూనిట్ సభ్యుల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాలోని ఒక పాట మాస్ ఆడియన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ అందరికి కూడా కన్నుల విందు అన్నట్లుగా ఉండబోతుందట. అద్బుతమైన మాస్ బీట్ తో థమన్ ఇప్పటికే రెడీ గా ఉన్నాడట. ఆ పాట సినిమాలో చాలా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు. కేవలం పాట మ్యూజిక్ అని కాకుండా ప్రతి ఒక్కటి కూడా స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు.
రామ్ చరణ్ డాన్స్ విషయంలో ఓ రేంజ్ లో కుమ్మేస్తాడు. ఆయన డాన్స్ ను మరియు శంకర్ స్థాయి సెట్టింగ్స్ మరియు విజువల్స్ తో ఆర్ సీ 15 లోని ఆ పాట మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరికి కూడా కన్నుల పండుగ అన్నట్లుగా ఉంటుందని అంటున్నారు. మెగా ఫ్యాన్స్ కు శంకర్ ఇవ్వబోతున్న అతి పెద్ద కానుక అదే అన్నట్లుగా కూడా చర్చ జరుగుతోంది.
శంకర్ మరియు చరణ్ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఏమాత్రం ఆలస్యం లేకుండా చకచక జరుగుతోంది. ఆగస్టు లేదా సెప్టెంబర్ వరకు సినిమా షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి లో విడుదల చేసే అవకాశాలు పుష్పలంగా ఉన్నాయి. సంక్రాంతికి ఈ సినిమా విడుదల అనే విషయం ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇక సినిమా ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.