Begin typing your search above and press return to search.

న్యూజిలాండ్ ఫ్లైట్ ఎక్కుతోన్న RC15

By:  Tupaki Desk   |   13 Nov 2022 7:48 AM GMT
న్యూజిలాండ్ ఫ్లైట్ ఎక్కుతోన్న RC15
X
ఆర్.సీ 15 షూటింగ్ జ‌రిగినంత కాలం జెట్ స్పీడ్ తో ముందుకు సాగింది. పూర్తిచేసి సంక్రాంతి కి వ‌చ్చేద్దా? అనుకుంటోన్న స‌మ‌యంలో క‌మ‌ల్ హాస‌న్ అడ్డుగా వ‌చ్చి చేరారు. ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న `భార‌తీయుడు-2` సైతం షూట్ పున ప్రారంభించాల్సి రావ‌డంతో సీన్ ట‌ర్న్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ ర‌కంగా ద‌ర్శ‌కుడు శంక‌ర్ రెండు సినిమాల్ని బ్యాలెన్స్ చేయాల్సి వ‌చ్చింది.

కొద్ది రోజులుగా శంక‌ర్ పూర్తిగా క‌మ‌ల్ సినిమాపైనే దృష్టి పెట్టి ప‌ని చేస్తున్నారు. దీంతో చ‌ర‌ణ్ కి విశ్రాంతి త‌ప్ప‌లేదు. అయితే ఈ గ్యాప్ ని చ‌ర‌ణ్ ఊర‌క‌నే విడిచిపెట్ట‌లేదు. ఆర్ ఆర్ ఆర్ జ‌పాన్ ప్ర‌మోష‌న్ కోసం...వ్య‌క్తిగ‌త విహారం కోసం వినియోగించుకున్నారు. మ‌ద్య‌లో అవ‌స‌ర‌మైన సంద‌ర్భంలో షూట్ లోనూ జాయిన్ అయ్యాడు. అయితే ఇక‌పై అంత విశ్రాంతి దొరికే ఛాన్స్ లేదు.

త్వ‌ర‌లో ఆర్ సీ 15 కొత్త షెడ్యూల్ ప్రారంభించ‌డానికి శంక‌ర్ రెడీ అవుతున్నారు. దీనిలో భాగంగా ఈ షెడ్యూల్ అంతా న్యూజిలాండ్ లో ప్లాన్ చేసారు. ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ సోమ‌వారం న్యూజిలాండ్ బ‌య‌ల్దేరుతున్నారు. ఈ విష‌యాన్ని చ‌ర‌ణ్ స్వ‌యంగా శ‌నివారం ఢిల్లీలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో తెలిపారు. అలాగే సినిమా అప్ డేట్స్ విష‌యంలో త‌న‌ని ఎవ‌రూ ఇబ్బంది పెట్టొద్ద‌ని భార‌మంతా శంక‌ర్ పైనే వ‌సేసారు.

సినిమా ప్ర‌చార చిత్రాల‌కు సంబంధించిన విష‌యాల‌న్ని శంక‌ర్ చూసుకు టున్నారుని...ఏదైనా ఆయ‌న్నే ఆడ‌గాల‌ని ఎస్కేప్ అయ్యారు. దీంతో అభిమానుల అత్యుత్సాహానికి చ‌ర‌ణ్ ఆర‌కంగా బ్రేక్ వేసారు. అప్డేట్స్ ప్లీజ్ అంటూ అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎప్ప‌టిక‌ప్పుడు చంటేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజా అప్డేట్ అభిమానుల‌కు కొంత వ‌రకూ ఊర‌ట‌నిచ్చేదే.

కొన్ని నెల‌లుగా సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేక‌పోడంతో ఫ్యాన్స్ నిరుత్సాహంలో క‌నిపిస్తున్నారు. రిలీజ్ సైతం వాయిదా ప‌డుతోంది అన్న‌ వార్త అభిమానుల్ని అంత‌కంత‌కు కాకెత్తిపోయేలా చేస్తోంది. ఈనేప‌థ్యంలో తాజా అప్ డేట్ రిలాక్స్ మోడ్ లో కి తీసుకెళ్తుంది. సినిమా ప్ర‌చారం బాధ్య‌త‌ల్ని చిరంజీవిలా త‌న‌యుడు కూడా ద‌ర్శ‌కుడుపైనే వేసేసారు. గాడ్ ఫాదార్ ప్ర‌చారం విష‌యంలో జ‌రిగిన త‌ప్పిదాలు `వాల్తేరు వీర‌య్య‌`లో జ‌ర‌గ‌కూడ‌ద‌ని భావించి ద‌ర్శ‌కుడు బాబినే ఆ బాధ్య‌త‌లు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అదే త‌ర‌హాలో ఆర్ సీ 15 ప్ర‌చారం ప‌నులు శంక‌ర్ నెత్తిన రుద్దినట్లు క‌నిపిస్తుంది.