Begin typing your search above and press return to search.
RC15 అతడే హీరో అతడే విలన్ అతడో రహస్యం
By: Tupaki Desk | 24 May 2022 6:30 AM GMTతన సినిమాల్లో ద్విపాత్రలు త్రిపాత్రలు క్రియేట్ చేయడం శంకర్ కి వెన్నతో పెట్టిన విద్య. జెంటిల్ మేన్ ని ఒక రాబర్ గా చూపించినా.. రామూని రెమోగా మార్చినా అతడికే చెల్లింది. ఒక సాధారణ ప్రేమికుడిని బీస్ట్ గా మార్చి వింతలు విన్యాసాలను తెరపై ఆవిష్కరించారు ఐ సినిమాలో.
ఇక రోబోగా సైంటిస్టుగా రజనీకాంత్ ని తెరపై చూపించిన వైనం మర్చిపోలేం. ఒక మనిషిలో మల్టిపుల్ డిజార్డర్స్ పై ఫోకస్ చేసి వాటిని అద్భుతంగా ఆవిష్కరించడంలో శంకర్ పనితనం ఎంతో గొప్పది. అందుకే ఇప్పుడు అతడు ఆర్.సి 15లో చరణ్ ని ఎలా చూపించబోతున్నాడో చూడాలన్న ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తదుపరి చిత్రం ఎలా ఉండబోతోంది? ఇందులో చరణ్ ని ఎన్ని వైవిధ్యమైన పాత్రలలో శంకర్ చూపిస్తున్నారు? అంటూ మెగాభిమానుల్లో చర్చ సాగుతోంది. ఈ సినిమా ఇప్పటికే దాదాపు నలభై శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అలాగే ఈ మూవీలో చరణ్ కెరీర్ లోనే తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడని అభిమానుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో చరణ్ తండ్రి.. ఇద్దరు కొడుకుల పాత్రలో కనిపించనున్నాడు. కొడుకులలో ఒకరు గ్రేషేడ్ పాత్రగా మలిచారని తెలుస్తోంది.
ఆ ఇద్దరిలో ఒకరు విలన్ కాగా.. మరొకరు సివిల్ సర్వెంట్ అవుతారని ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఇక నెగెటివ్ షేడ్ ఉన్న కొడుకు పాత్ర సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని సమాచారం. నిజానికి శంకర్ ఒక పాత్రను క్రియేట్ చేసారు అంటే దానికి ఒక పర్పస్ ని అంతే బలంగా ఆపాదిస్తారు. ఒక కొడుకు విలన్ గా మారేందుకు బలమైన కారణం ఉంటుందనడంలో సందేహం లేదు.
అయితే నెగెటివ్ షేడ్ పాత్ర నుంచి కావాల్సినంత నటనను పిండుకునేందుకు తనకు ఉండే ఛాయిస్ ని శంకర్ అస్సలు వదులుకోరు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి మొత్తం షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయాలనుకుంటున్నాడు శంకర్. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ను వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ లో విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్లు చిత్రం పెద్దతెరపై హిట్టు కాకపోయినా బుల్లితెరపై గొప్ప ఆదరణ దక్కించుకుంది. ఇందులో మూడు పాత్రలలో వైవిధ్యమైన నటనతో చిరు ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మాస్ ఫ్యాన్స్ కి చిరు మైమరిచే ట్రీటిచ్చారు. అయితే అందుకు భిన్నమైన కథ పాత్రల్లో చరణ్ ఇప్పుడు నటిస్తున్నారు.