Begin typing your search above and press return to search.
RC15 : టైటిల్ విషయంలో మళ్లీ హడావుడి
By: Tupaki Desk | 17 Jun 2022 8:30 AM GMTరామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ సీ 15 సినిమా టైటిల్ విషయంలో గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అయ్యింది. అయితే ఇప్పటి వరకు షూటింగ్ అప్డేట్ కాని ఫస్ట్ లుక్ కాని రివీల్ చేయలేదు. షూటింగ్ ముగింపు దశకు చేరుకుని ఉంటుందని మీడియా వర్గాల్లో చర్చ కూడా జరుగుతోంది.
ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అన్ని భాషలకు సెట్ అయ్యే విధంగా 'అధికారి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. ఇటీవలే దిల్ రాజు అధికారి టైటిల్ ను ఛాంబర్ లో రిజిస్ట్రర్ చేయించారని తెలుస్తోంది. దాంతో మళ్లీ సినీ వర్గాల్లో మరియు మెగా అభిమానుల్లో ఈ సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియా లో చర్చ జరుగుతోంది.
రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ స్టార్ కాస్టింగ్ ఉండబోతుంది. గతంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక్కడు.. ఇంకా కొన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా మంచి సోషల్ మెసేజ్ తో ఉంటుందని యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.
ఇప్పటికే లీక్ అయిన ఫోటోలు మరియు వీడియోలను బట్టి ఈ సినిమాలో చరణ్ డబుల్ రోల్ లో కనిపించబోతున్నాడు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా ఒక పాత్రలో చరణ్ కనిపించబోతున్నాడట. మరో పాత్ర లో అధికారిగా చరణ్ కనిపిస్తాడు అంటూ చర్చ జరుగుతోంది. సినిమాకు విపరీతమై బజ్ ఉన్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రామ్ చరణ్ గత చిత్రం ఆర్ ఆర్ ఆర్ సూపర్ హిట్ అవ్వగా.. కీలక పాత్రలో నటించిన ఆచార్య మాత్రం ప్లాప్ అయ్యింది. దాంతో చరణ్ అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. శంకర్ సినిమాల కు పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ఉంటుంది. కనుక దిల్ రాజు ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయి సినిమా గా నిర్మిస్తున్నాడు.
సంక్రాంతికి ఈ సినిమా విడుదల కనుక సమయం చాలా ఉంది. అందువల్ల టైటిల్ విషయంలో క్లారిటీ రావడానికి ఇంకాస్త సమయం పట్టవచ్చు. అలాగే ఫస్ట్ లుక్ ను కూడా ఆలస్యంగానే విడుదల చేసే అవకాశం ఉంది.