Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: RDX లవ్.. RDX లాగానే ఉందే!

By:  Tupaki Desk   |   3 Oct 2019 7:55 AM GMT
ట్రైలర్ టాక్: RDX లవ్.. RDX లాగానే ఉందే!
X
RX100' విజయంతో ప్రేక్షకుల్లో భారీ గుర్తింపు సాధించిన పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు 'RDX లవ్' అనే మరో బోల్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తేజస్ హీరోగా శంకర్ భాను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రోమోస్ బోల్డ్ కంటెంట్ తో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. తాజాగా 'RDX లవ్' టీమ్ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేసింది.

ఒక నిముషం పైగా ఉన్న ఈ ట్రైలర్ "అలివేలు గారు మీరంటే నాకు పిచ్చి ఇష్టం" అని హీరో చెప్పడంతో స్టార్ట్ అవుతుంది. ఇక హీరోయిన్ కూడా లవ్ లో పడుతుంది కదా.. దానికి శాంపిల్ అన్నట్టుగా మరో సీన్ లో "ఆడపిల్లలు ఎంత రిస్క్ చేసినా పక్కన మగాడుంటే ఆ ధైర్యమే వేరు" అంటూ హీరోకు చెప్తుంది. లవ్ ట్రాక్ ను మించి సినిమాలో ఏదో సీరియస్ ఎలిమెంట్ ఉందని చూపిస్తారు. "వేటాడాలకున్న మగాడికి ఆడపిల్ల లేడిపిల్లలా కనిపించొచ్చు.. అదే వేటాడాలనుకున్న ఆడపిల్లకి సింహం లాంటి మగాడు కూడా కుక్కపిల్లలా కనిపిస్తాడు". మరో సీన్ లో వస్తాదుల్లాంటి రౌడీలను ఫైట్లో పాయల్ పడగొట్టడం చూస్తుంటే పాయల్ కు పవర్ఫుల్ రోల్ ఇచ్చినట్టు అర్థం అవుతుంది. హీరో తండ్రి హీరోయిన్ ను ఉద్దేశించి "అది నాకొడుకుని మసాజ్ బాయ్ లా వాడేసుకుంటుంది" అంటాడు. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో పాయల్ కు ఏదో పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉందనే ఆలోచన రావడం ఖాయం.

ఇక ట్రైలర్ లో హీరో హీరోయిన్ల మధ్య బోల్డ్ రొమాంటిక్ సీన్లు కూడా ఉన్నాయి. మరి ఆ సీన్లు కథలో భాగంగా వస్తాయా లేదా అనేది సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు. ఓవరాల్ గా ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేదిగానే ఉంది. 'RDX లవ్' అక్టోబర్ 11 వ తేదీ రిలీజ్ అవుతోంది. అంతలోపు ఈ రిలీజ్ ట్రైలర్ పై ఒక లుక్కేయండి..