Begin typing your search above and press return to search.

మళ్లీ బికినీకి రెడీ.. ఈసారి ఖరీదు ఎక్కువ

By:  Tupaki Desk   |   1 May 2020 7:30 AM GMT
మళ్లీ బికినీకి రెడీ.. ఈసారి ఖరీదు ఎక్కువ
X
ప్రస్తుతం టాలీవుడ్‌ లో టాప్‌ స్టార్‌.. మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో ముందు వరుసలో ఉంటుంది పూజా హెగ్డే. ఈ అమ్మడు తెలుగుతో పాటు హిందీలో కూడా అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటూ ఉంది. గత ఏడాది హౌస్‌ ఫుల్‌ 4 చిత్రంతో హిందీ ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు ఇటీవల మరో అవకాశంను దక్కించుకుందట. హిందీలో ఈమె నటించబోతున్న కొత్త సినిమాలో బికినీ వేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే ఈ అమ్మడు బికినీతో ఫొటో షూట్స్‌ ఇవ్వడంతో పాటు బన్నీతో నటించిన ‘డీజే’ చిత్రంలో బికినీ వేసుకుంది. ఆ సినిమా సమయంలో పూజా హెగ్డేకు పెద్దగా క్రేజ్‌ లేదు. కనుక పారితోషికం తక్కువే తీసుకుంది. కాని ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్‌ లో మోస్ట్‌ క్రేజీ హీరోయిన్‌. అలాగే బాలీవుడ్‌ లో కూడా అప్‌ కమింగ్‌ క్రేజీ హీరోయిన్‌. కనుక పారితోషికం విషయంలో చాలా పట్టింపుతో వ్యవహరిస్తుందట. సాదారణంగా రెండు కోట్ల వరకు పారితోషికం తీసుకునే ఈ అమ్మడు హిందీలో బికినీతో పాటు బెడ్‌ రూం సీన్స్‌ ల్లో నటించేందుకు ఏకంగా మూడు కోట్ల రూపాయలను డిమాండ్‌ చేసిందట.

హీరోయిన్‌ పాత్రకు ఉన్న ప్రాముఖ్యత మరియు బికినీ సీన్స్‌ ఎక్కువ సార్లు ఉండటం వల్ల ఆమె అడిగిన మొత్తంను ఇచ్చేందుకు ఓకే చెప్పారట. ఒక వైపు వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూనే బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా అవ్వాలనే ఈ అమ్మడి ప్రయత్నంను అంతా అభినందిస్తున్నారు. అయితే ఈమె చేస్తున్న రెండు పడవల ప్రయాణం మంచిది కాదంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు.

ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌ మరియు అఖిల్‌ ల సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు కాకుండా మరో రెండు పెద్ద సినిమాల్లో కూడా ఈమెను ఎంపిక చేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితం అయిన ఈ అమ్మడు లాక్‌ డౌన్‌ ఎత్తివేసి షూటింగ్స్‌ మొదలు పెట్టిన వెంటనే మళ్లీ బిజీ బిజీ అవ్వనుంది.