Begin typing your search above and press return to search.
వెండి తెరని ఏలిన అందాల భామల అసలు పేర్లు ఇవి!
By: Tupaki Desk | 6 Oct 2022 11:30 PM GMTరంగుల ప్రపంచాన్ని ఏలే క్రమంలో కొన్ని కొన్ని మార్పులు తప్పనిసరి. ఇండస్ర్టీ..ప్రేక్షకులు ఇచ్చే బిరుదుల్ని ఇంటి పేరుగాను మార్చకున్న వారెంతో మంది ఉన్నారు. ఇండస్ర్టీ ఎప్పుడు గతాన్ని చూడదు..తెరకెక్కి సక్సెస్ అయిన తర్వాత అందుకున్న లెగస్సీని మాత్రమే చూస్తుంది. ఈ క్రమంలో పేర్లు సైతం మారుతుంటాయి. అలా వెండి తెరను ఏలిన కొంత మంది నటీమణులు వాస్తవ పేర్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
మద్రాసులో జన్మించిన జయసుధ సహజ నటిగా టాలీవుడ్ లో పేరొందారు. ఆమె అసుల పేరు సుజాత. అలాగే రాజమండ్రిలో పుట్టిపెరిగిన జయప్రద అలసు పేరు లలితారాణి. ఇండస్ర్టీకి వచ్చిన తర్వాత జయప్రదగా పేరు మార్చుకున్నారు. అతిలోక సుందరి శ్రీదేవి కోలీవుడ్ లో బాలనటిగా ప్రవేశించారు. శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్. ఆమె పక్కా తమీళియన్. దేశంలో అన్ని భాషల్లోనూ సినిమాలు చేసారు. కానీ తెలుగులో ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ఇప్పటికీ శ్రీదేవిని చాలా మంది తెలుగు అమ్మాయి అనే అనుకుంటారు.
అలాగే 'తలంబ్రాలు' సినిమాతో టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చిన జీవిత స్వస్థలం శ్రీశైలం. ఆమె అసలు పేరు పద్మ. ఆమె ఇంట్లో అందరూ పెద్ద పెద్మ..పెద్ద బొట్టు పద్మ అని పిలిచేవాళ్లు. అలాగే తెలుగు ప్రేక్షకులతో మన తెలుగింటి అమ్మాయి అని పిలుపించుకున్న నటి సౌందర్య. 100 సినిమాలకు పైగా నటించిన సౌందర్య అసలు పేరు సౌమ్య.
సినిమాల్లోకి వచ్చే ముందు సౌందర్య పేరు మార్చుకున్నారు. నెల్లూరులో జన్మించిన ఆమని అలసు పేరు మంజుల. 'జంబలకిడిపంబ' సినిమాతో తెలుగులో లాంచ్ అయ్యారు. ఆ తర్వాత చాలా సినిమాలు చేసారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరోందిన రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి.
నటిగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకుని ప్రజా సేవలో కొనసాగుతున్నారు. అలాగే విజయవాడ బ్యూటీగా పేరు గాంచిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. ఈవీవీ సత్యనారాయణ ఆమెను హీరోయిన్ గా పరిచయం చేసారు. అలాగే అందం..అందాలతో మంత్ర ముగ్దుల్ని చేసిన రాశీ అసలు పేరు కూడా విజయలక్ష్మి. ఆమెని మంత్ర అని కూడా పిలుస్తుంటారు. బాల నటిగా తెరంగేట్రం చేసింది.
అలాగే 'ఖుషీ'తో కుర్రకారును షేక్ చేసిన బ్యూటీ భూమిక. ఈమె అసలు పేరు రచనా చావ్లా. గడియా అని కూడా పిలుస్తుంటారు. ఇంకా నేటి జనరేషన్ హీరోయిన్లలో చాలా మంది రక రకాల కారణాలతో పేర్లు మార్చుకున్నారు. కొందరికి కలిసి రాలేదని... మరికొంత మంది పేరు మార్చుకుంటే పెద్ద హీరోయిన్ అవుతారన్న నమ్మకంతో నామకరణాల్లో మార్పులు చేసుకున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.