Begin typing your search above and press return to search.
రాజ్ కుంద్రా అరెస్ట్ వెనుక అసలు కారణాలివే
By: Tupaki Desk | 2 Aug 2021 3:30 PM GMTఅంతర్జాతీయ స్థాయిలో అశ్లీల రాకెట్ ను నడిపిన రాజ్ కుంద్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న క్రైంబ్రాంచ్ పోలీసులు అనేక విషయాలను వెల్లడిస్తున్నారు.
తాజాగా హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ , పోలీసులు అనేక విషయాలను జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. ఈ అశ్లీల రాకెట్ కేసులో కొత్తగా తెరపైకి 'యష్ ఠాకూర్ అలియాస్ అరవింద్ శ్రీవాస్తవ' పేరు వచ్చింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. తనపై బెదిరింపులకు పాల్పడి కొందరు డబ్బు లాగేశారని ఆరోపించారు. ఈ కేసులో తాను బాధితుడిని అంటూ యష్ థాకూర్ ముంబై పోలీసులకు లేఖ రాశారు.
యష్ తరుఫున కోర్టులో ఆయన తరుఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 'నా క్లయింట్ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశారు. కావున వాటిని ఆన్ ఫ్రీజ్ చేయాలని కోర్టును కోరారు. రాజ్ కుంద్రా కేసును జస్టిస్ అజయ్ గడ్కరీ బెంచ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరుణాపాయ్ పలు విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఈ కేసులో ఆధారాలు బలంగా ఉన్నాయని.. భారత చట్టాలకు వ్యతిరేకంగా సినిమాలను నిర్మించారు. ఒకవేళ వాటికి నిరూపించగలిగితే నిందితులకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని పాయ్ చెప్పారు.
తన అశ్లీల వ్యాపారానికి కీలకమైన హాట్ షాట్ , బోలీ ఫేమ్ యాప్ లను అమలు చేస్తున్న రాజ్ కుంద్రా.. ఈ ఏడాది మార్చిలో తన ఫోన్ ను కూడా మార్చినట్టు వెల్లడైంది. అప్పుడు చేస్తారనే భయంతోనే అతడు తన పాత ఫోన్ ను కనిపించకుండా విసిరేశాడని సమాచారం. ఆధారాలను తొలగించే ప్రయత్నం చేశారని.. కానీముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ రెండు యాప్ ల నుంచి 51 అశ్లీల సినిమాలను స్వాధీనం చేసుకున్నట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. రాజ్ కుంద్రా, ర్యాన్ థోర్పే ఇద్దరు తమ ఏర్పాటు చేసుకొన్న వాట్సాప్ గ్రూప్ లను, చాట్స్ ను ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేశారు. సాక్ష్యాలను రూపుమాపడానికి ప్రయత్నించారు. అందుకే అరెస్ట్ చేశాం అని పాయ్ పేర్కొన్నారు.
భారతీయ శిక్షాస్మృతి ప్రకారం రాజ్ కుంద్రా, అతడి బావ ప్రదీప్ బక్షి చేసిన నేరాలు తీవ్రమైనవని తేలింది. లండన్ వేదికగా జరుగుతున్నాయని ముంబై పోలీసులు కోర్టుకు వెల్లడించారు.
ఈ కేసులో రాజ్‌కుంద్రా దాఖలు చేసిన బెయిల్ కోర్టు తిరస్కరించింది. రాజ్ కుంద్రా 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకొన్నది.. ఇప్పటికే 14 ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్, వెబ్ పోర్టల్స్ పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.