Begin typing your search above and press return to search.
ఆకాశవాణి ఆలస్యానికి కారణం?
By: Tupaki Desk | 1 Aug 2019 1:30 AM GMTదర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి వారసుడు కార్తికేయ ఓ సినిమా తీస్తున్నారు అంటే దానిపై అంచనాలుంటాయి. జక్కన్న మార్క్ ఉంటుందా ఉండదా? అతడి ఆలోచనా విధానం ఎలా ఉంది? ఎలాంటి కథను ఎంచుకున్నాడు? నట ప్రతిభను ఎలా రాబట్టుకున్నారు? అంటూ విశ్లేషిస్తారు. దర్శకత్వం కాకపోయినా.. నిర్మాతగా అయినా అతడి అభిరుచి ఎలా ఉంది? అన్నది చూస్తారు.
సరిగ్గా ఇదే ఒత్తిడి కార్తికేయ నిర్మిస్తున్న తొలి చిత్రం `ఆకాశవాణి` రిలీజ్ ఆలస్యానికి కారణమవుతోంది. రాజమౌళి వారసుడు నిర్మాత అయితే.. శిష్యుడు అశ్విన్ గంగరాజు ఇదే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వీళ్లకు కీరవాణి వారసుడు కాలభైరవ జత అయ్యి సంగీతం అందిస్తున్నారు. దీంతో కొత్త కుర్రాళ్లపై ఒత్తిడి పెరిగిందట. ఎక్కడ ఏ తప్పు చేసినా జక్కన్న ఇన్విజిలేషన్ ఉంటుంది కాబట్టి ఆ మేరకు మార్పు చేర్పులు తప్పడం లేదు. తనయుడిని తొలి సినిమాతోనే స్థాయి ఉన్నవాడిగా పరిచయం చేయాలన్నది రాజమౌళి ఆలోచన. అందుకే ఆకాశవాణి లో మార్పు లు సూచించారట.
షూటింగ్ మొత్తం పూర్తయినా కీలకమైన విలన్ పాత్ర సరిగా లేకపోవడంతో ఆ నటుడినే మార్చి మళ్లీ రీషూట్ చేయించారట. అందుకే ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఆలస్యమైందని తెలుస్తోంది. చాలా కాలం క్రితమే సినిమా ప్రారంభమైనా ఎందుకు ఆలస్యమైంది? అంటూ ఎదురు చూస్తున్న వారికి ఎట్టకేలకు దీనిపై ఓ క్లారిటీ వచ్చినట్టే. బుర్రా సాయిమాధవ్ ఈ క్రేజీ చిత్రానికి మాటలు అందిస్తున్నారు.