Begin typing your search above and press return to search.

అంతన్నాడు ఇంతన్నాడే.. అమీర్ ఖానూ..

By:  Tupaki Desk   |   26 Jan 2016 5:30 PM GMT
అంతన్నాడు ఇంతన్నాడే.. అమీర్ ఖానూ..
X
అమీర్ ఖాన్ టోన్ ఇప్పుడు బాగా ఛేంజ్ వచ్చింది. కరెక్ట్ గా రెండు నెలల క్రితం ఉన్న వాయిస్ ఇప్పుడు లేదు. ఎందుకంటే అప్పుడున్న స్థాయి, గౌరవం ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. అభిమానించడం మానేసి, వ్యతిరేకించే జనాల సంఖ్య పెరగడంతో.. అమీర్ పరిస్థితి మామూలుగా లేదు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ.. తనకి అసహనం లేదని చెప్పాడు అమీర్.

ఇదంతా మీడియా చేసిన హంగామా అంటూ ఎస్కేపిజం ట్రై చేశాడు. తాను ఇండియా వదిలి వెళ్లాలని అనుకోవడం లేదని కూడా చెప్పాడు. అసహనం కామంట్స్ కారణంగానే ఈ పరిస్థితి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజానికి అమీర్ అసలు బాధేంటే ఇప్పుడు మనకు ఈజీగానే అర్ధమవుతుంది. ఇప్పటివరకూ అసహనం కామెంట్స్ కారణంగా.. అమీర్ ని వ్యతిరేకించారు కానీ, ఈ హీరోకి పెద్దగా వాటిల్లిన నష్టం ఏం లేదు. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ సైట్లలో అమీర్ మూవీకి వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది. 'బాయ్ కాట్ దంగల్' అంటూ ప్రత్యేకమైన హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్ గానే ఉంది. అసలు ఈ సినిమా రిలీజ్ కి చాలానే టైం ఉంది.

డిసెంబర్ 23న దంగల్ ని రిలీజ్ చేయనున్నారు. అప్పటివరకూ సైలెంట్ గా ఉంటే.. ఆ ఎఫెక్ట్ బిజినెస్ పై గ్యారంటీగా ఉంటుంది. అందుకే కాస్త ముందుగానే జాగ్రత్త పడుతున్నాడు ఈ మిస్టర్ మాజీ పర్ఫెక్షనిస్ట్. ఏమైనా అన్నీ బాగున్నప్పుడు అంతేసి ఇంతేసి చొప్పున మాటలు అనేసి, ఇప్పుడు మాత్రం కవరింగ్ కబుర్లను బాగానే ట్రై చేస్తున్నాడు. చూద్దాం.. ఇంకా దంగల్ రిలీజ్ కి చాలా టైం ఉంది కాబట్టి.. అమీర్ ప్రయత్నాలు ఏమాత్రం సిద్ధిస్తాయో?