Begin typing your search above and press return to search.
అఖిల్ కి అన్ని ప్రాబ్లెమ్స్ అందుకేనా?
By: Tupaki Desk | 30 May 2016 5:43 AM GMTఓ సినిమా ఫెయిల్ అవ్వడానికి చాలానే కారణాలను విశ్లేషించేస్తారు సినీ జనాలు. అయితే.. ఆ ప్రాబ్లెమ్స్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుండడమే ఆలోచించాల్సిన విషయం. అక్కినేని వంశానికి లేటేస్ట్ వారసుడు అఖిల్ నటించిన తొలిమూవీ అఖిల్ డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పటికీ ఈ హీరో సమస్యల్లోనే ఉండడంతో.. ఇప్పుడు అసలు కారణం ఒకటి చెబుతున్నారు.
అఖిల్ చిత్రాన్ని అమావాస్య రోజున రిలీజ్ చేయడంతోనే.. ఈ సమస్యలు వచ్చాయనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. తొలి సినిమాను ఇలా అమావాస్య నాడు విడుదల చేసినప్పుడే.. రిజల్ట్ పై నెగిటివ్ అంచనాలు వచ్చాయి. అఖిల్ రిలీజ్ అయ్యి ఆరు నెలలు గడిచిపోయినా.. ఇప్పటికీ రెండో సినిమా ప్రారంభం కాని సంగతి తెలిసిందే. బడా బడా దర్శకుల పేర్లు వినిపించినా.. ఒకటి కూడా పట్టాలెక్కలేదు.
రెండో సినిమాతో ఎలాగైనా సక్సెస్ సాధించాలనే ఆలోచనతో.. చాలా ప్రయత్నాలు చేస్తున్నా.. అఖిల్ సెకండ్ సెట్ కాకపోవడానికి కారణం.. ఈ అమావాస్య సెంటిమెంట్ ఎఫెక్టే అంటున్నారు సినీ జనాలు. సెంటిమెంట్లు ఎక్కువగా ఫాలో సినిమా ఇండస్ట్రీలో.. ఇప్పుడీ అమావాస్య టాక్ నుంచి బయటపడాలంటే.. త్వరగా ఓ సక్సెస్ సాధించాల్సిన అవసరం అఖిల్ కి ఉంది.